ఆర్మూర్ నియోజకవర్గం హాటాట్ న్యూస్ ఇది

అరవైయేళ్లుగా తెలంగాణాను ఏదో ఒక రూపంలో పరిపాలిస్తున్న  రెడ్లు రాజ్యాధి కారం కోల్పోవడమనేది  ప్రత్యేక తెలంగాణ విశిష్టత. తిరిగి రాజ్యాధికారం చేపట్టాలన్న కసి రెడ్లలో బాగా  పెరిగింది. రెడ్ల అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటుచేశారు. రెడ్డి గర్జన చేపట్టారు. రెడ్ల జాగృతి వంట్టి సంస్థలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో రెడ్డి యువకులు కుతకుత లాడుతున్నారు. తెలంగాణలో రాజకీయాలు ఏమలుపు తిరిగినా రెడ్డి కోణంలో నుంచే చూడటం మొదలయింది. ఈ రెడ్లతో ఎపుడయినా సమస్య వస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలుసు. అందుకే ఆయనకు రెడ్డి కనిపిస్తే చాలు ఆయన యోగ క్షేమాల మీద ఎనలేని శ్రద్ధ చూపిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి యా లేక తెలంగాణ రెడ్ల సమితి యా అనే అనుమానం వచ్చేలా ఆయన రెడ్లకు పదువులిచ్చారు. ఒపిక వున్న వాళ్లు వెరిఫై చేసుకోవచ్చు. 2014 నుంచి ఆయన రెడ్ల సంక్షేమం కోసం ఎంతో శ్రమ తీసుకున్నారు. రెడ్డి ఐఎఎస్ ఆఫీసర్ రిటైరయితే పోస్టింగిచ్చారు. రెడ్ల మెధావులకు  పోస్టులిచ్చారు. రెడ్ల ప్రొఫెసర్లకు పోస్టు లిచ్చారు. రెడ్లకిచ్చిన మొత్తం పోస్టులు చూస్తే  ఈ సంగతి అర్థమవుతుంది. అయినా తెలుగు రాష్ట్రాలలో రెడ్లు లేని రాజకీయాలుంటాయా? ఒక వేళ ఎక్కడయిన పెద్ద రెడ్డి ఎదరయితే, అక్కడున్న చోటారెడ్డిని మార్చేందుకు కెసిఆర్ సిద్దంగా ఉన్నారు. ఇాలాంటిది తొందర్లో జరగబోతున్నదని రాజకీయాల్లో వర్గాల్లో వినబడుతూ ఉంది.

 ఈ పెద్ద రెడ్డి ఎవరో కాదు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టి ఈ మధ్య టిఆర్ ఎస్ లో చేరారు. హోదాను బట్టి రిసెప్షన్ ఉంటుంది.  ముఖ్యమంత్రి కుమారుడు , కాబోయే ముఖ్యమంత్రి అని పేరున్న కెటిఆర్ స్వయంగా సురేష్ రెడ్డిని  పార్టీలోకి తీసుకువచ్చారు. ఆయన కెటిఆర్ టీమ్ లో చాలా కీలకమయిన పొజిషన్లో ఉంటాడని అంటున్నారు.

ఇంత గౌరవ ప్రదంగా తీసుకొచ్చినపుడు అంతే సముచిత గౌరవం చూపాలిగా. అందుకే ఆయన్న పార్టీ ఎమ్మెల్యేగా నిలబెడితే ఎలా ఉంటుందున్న ఆలోచన అధిష్టానంలో ఉందట. 

అదెలా సాధ్యం?

అదెలా సాధ్యం అంటే ఆయనకు  ఆర్మూర్ నియోజకవర్గం ఇవ్వాలి. 2014 లో సురేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిఆర్ ఎస్ అభ్యర్థి ఆసన్నగారి జీవన్ రెడ్డి చేతిలో 13000 వోట్ల తేడాతో వోడిపోయాడు. ఇపుడు ఆయన ఆర్మూర్ టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన TRS-105 లో జీవన్ రెడ్డి పేరుంది. అయినా సరే, జీవన్ రెడ్డిని మార్చి సురేష్ రెడ్డి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ పైస్థాయిలో మొదలయింది. ఈ విషయం తెలిసి జీవన్ రెడ్డి అనుచరులు కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే,జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కూతురు కవిత అండదండలున్నాయి. ఆమె అనుచరుల్లో ముఖ్యమయిన వాడు జీవన్ రెడ్డి . ఈ కారణంచేత ఆయన పేరు ను మార్చకుండా వదిలేస్తారా?  

అయితే,  కెటిఆర్ ఇంగ్లీష్ మాట్లాడే సురేష్ రెడ్డి ని పోటీ పెట్టాలనుకుంటున్నారని సమాచారం. సురేష్ రెడ్డి విదేశాలలో చదువుకున్నారు. తెలుగు రాష్ట్రం స్పీకర్ ఊంటూ సభని ఇంగ్లీష్ లో నడిపించిన వారు. మనిషి కూడా క్లాస్. కెటిఆర్ తో వేవ్ లెంగ్త్ కూడా కుదిరిందని టాక్ ఉంది. వచ్చే సభలో ఆయనను స్పీకర్ నైనా చేయవచ్చు, లేదా తన క్యా బినెట్ లోకి తీసుకో వచ్చు.

ఇంత ప్రాముఖ్యం ఉన్న సురేష్ రెడ్డి ఎలా అకామోడేట్ చేస్తారో చూడాలి. జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి తప్పిస్తారా?  ఏమవుతుందో చూడాలి.

 

మరొక హాట్ న్యూస్

తెలంగాణలో బాలయ్య పర్యటన ఆంతర్యం ఏమిటి (వీడియో)