డీఎస్ సంగతి కేసీఆర్ కు వదలిపెట్టాం -కవిత

టిఆర్ఎస్ పార్టీలో డిఎస్ వివాదంపై ఎంపి కవిత ఆచితూచి స్పందించారు. గతంలో డిఎస్ మీద వేటు వేయాలని కవిత నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులంతా సిఎం కేసిఆర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా ఆమె మీడియాతో డిఎస్ విషయం పై స్పందించారు. ఈ అంశాన్ని కేసిఆర్ నిర్ణయానికి వదిలేశామన్నారు. భూపతిరెడ్డి విషయంలోనూ కేసిఆర్ నిర్ణయానికే వదిలేశామన్నారు. బుదవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం కవిత మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆమె మాట్లాడిన అంశాలివి.. చదవండి.

రేపటినుండి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి ఆమె విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో జరిగే ప్రతి చర్చలోనూ పాల్గొంటామని తెలిపారు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. గత పార్లమెంటు సమావేశాల్లో రిజర్వేన్ల పెంపు, మహాత్మాగాంధీ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని డిమాండ్ చేసి..పార్లమెంటు లోపల ఆందోళన చేసిన విషయాన్ని కవిత ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిలో సాధించుకోవడానికి రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతీయ పార్టీకి ఏదో ఒక ఎజెండా ఉంటుంది.. ప్రజల సమస్యలపై మేం కూడా కేంద్రాన్ని నిలదీస్తాం అన్నారు. అసలు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నుంచి సరైన స్పందన రావడం లేదని అన్నారు ఇతర పార్టీలతో ఫ్లోర్ కోఆర్డినేషన్ ఉంటుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కుంతియా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రస్తావించగా మాది తెలంగాణ సామాజిక వర్గం పార్టీ తెలంగాణ కులం ఉద్యమంలో కులాలు మతాల కతీతంగా పనిచేశాం ఇప్పుడు చిన్నచిన్న కమిటీ కూడా సీఎం కేసీఆర్ అనేక అవకాశాలు కల్పిస్తున్నారు సరైన ప్రాతినిధ్యం చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారని తెలిపారు. నాన్ సీరియస్ పొలిటిషియన్స్ వ్యాఖ్యలపై మాట్లాడేది ఏమీ లేదని ఎంపీ కవిత స్పష్టం చేశారు.

జిఎస్టి, డిమానిటైజేషన్ అంశాల్లో కేంద్రానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రాలకు మేలు జరగాలని మా పార్టీ ఉద్దేశమన్నారు. రాష్ట్రాలకు అందించాల్సిన చేయూత విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉందని అన్నారు.

గత సమావేశాల్లో వైఎస్ఆర్సిపి, టీడీపీ అవిశ్వాసం నోటీసు ఇచ్చాయని, యాక్సెప్ట్ కాలేదని తెలిపారు. ఈసారి అవిశ్వాసం నోటీస్ టేకప్ చేస్తే, ఏం చేయాలి అనే విషయమై పార్టీలో చర్చిస్తామని కవిత తెలిపారు.

మా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతామన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు ఇవ్వొద్దని చెప్పే కుసంస్కారం మాకు లేదని స్పష్టం చేశారు.

ఇన్నాళ్లు బిజెపితో ఉన్న టిడిపి ఇప్పుడు అవిశ్వాసం ప్రవేశపెడతామని అంటోంది.. ఏపీ పొలిటిషన్ లు, ఏపీ ప్రజలు ఆ పార్టీ గురించి ఆలోచించుకోవాలని అన్నారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయని ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.

దేశ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశమన్నారు. ప్రాంతీయ సమస్యలు పార్లమెంటులో చర్చకు రావాల్సి ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రైతుబంధు, ఇంటింటికీ నల్ల కనెక్షన్ వంటి అవసరాలు దేశ ప్రజలకు అందించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ దని, ఫెడరల్ ఫ్రంట్ ఆ దిశగా కృషి చేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ బిజెపికి గట్టి కౌంటర్ యివ్వలేని పరిస్తితిలో ఉంది అన్నారు. పథకాల రూపకల్పనలో అవినీతికి ఆస్కారం లేని విధంగా రూపొందించారు.. అందుకే వాళ్లకు మాట్లాడేది ఏమీ లేక ఏదో ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు కళ్ళు తిరుగుతున్నాయని అన్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశాల్లో మా గ్రామానికి అయిదారు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారని తెలిపారు కాంగ్రెస్ హయాంలో తపస్సు చేసిన ఒకటి నుంచి రెండు లక్షల రూపాయలు ఇవ్వలేదని వారు చెప్పారని తెలిపారు.