డిఎస్ పై కేసీఆర్ ఏమన్నారంటే

డీఎస్ పై కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. డీఎస్ తో నేనేమి ఒప్పందాలు చేసుకోని పార్టీలోకి తీసుకోలేదు. పెద్ద మనిషి పార్టీలోకి వస్తానంటే సరే రమ్మని ఆహ్వానించాం. రాజ్యసభకు అవకాశం వస్తే కావాలని అడిగితే పెద్ద మనిషిని కదా అని అవకాశం ఇచ్చినం. రాజ్యసభ సభ్యున్ని చేసినం.

కానీ ఆ తర్వాత డిఎస్ వారి కొడుకుల కోసం పక్క పార్టీ వారితోటి టచ్ లో ఉన్నారని చాలా స్పష్టంగా ఆధారాలు దొరికినయి. అందుకే నిజామాబాద్ నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి పంపించారు. దాని తీరు పై కేకే తో చర్చించి తాను పెండింగ్ లో పెట్టానని చెప్పారు. ఆయన ఎటువంటి కామెంట్స్ చేసినా నేనేమి వ్యాఖ్యానించలేదు. ఇప్పటికి కూడా ఆయన ఇష్టం ఉంటే ఉండొచ్చు.. పోతే పోవచ్చు.. దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని కేసీఆర్ అన్నారు.