డి. శ్రీనివాస్ షాకింగ్ డిసిషన్

డిఎస్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నారు. టిఆర్ ఎస్ పార్టీలో వచ్చిన విభేదాల నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయనని, కేసీఆరే తన పై చర్య తీసుకోవాలన్నారు. తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి  అక్టోబర్ 11న రాజీనామా చేస్తానని డిఎస్ ప్రకటించారు. టిఆర్ ఎస్ లో తన అనుచరులు ఇమడలేక పోతున్నారని, తాను పార్టీ మారే విషయంలో తన పై అనుచరుల ఒత్తిడి చాలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను తిరిగి చేరబోతున్నానని డిఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డిఎస్ కుమారుడు అరవింద్ బిజెపిలో చేరబోతున్నారని దానికి డిఎస్ సహకరిస్తున్నారని నిజామాబాద్ నేతలంతా ఎంపీ కవిత ఆధ్వర్యంలో సమావేశమై డిఎస్ ను సస్పెండ్ చేయాలని తీర్మానించారు. దీని పై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. ఇది జరుగుతుండగానే డిఎస్ కుమారుడు సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలో అరెస్టయ్యారు.

వీటన్నింటి నేపథ్యంలో డిఎస్ కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా  ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో డిఎస్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తాను ఏం తప్పుచేశానో చెప్పాలని అప్పటి వరకు తాను పార్టీకి కానీ పదవికి కానీ రాజీనామా చేయనని ప్రకటించారు. ఈ లోపు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన డిఎస్ ఇప్పుడు తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. డిఎస్ ను ఏఐసీసీలోకి తీసుకుంటామని కాంగ్రెస్ పెద్దలు హామీనిచ్చినట్టు తెలుస్తోంది.  

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవితోనే టిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ కూడా తన పదవితోనే కాంగ్రెస్ లోకి పోతారని అంతా భావించారు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో డిఎస్ ప్లానింగ్ ప్రకారమే పదవి వదిలి కాంగ్రెస్ లోకి వెళుతున్నారని పలువురు అంటున్నారు. డిఎస్ అంత దైర్యం చేయలేడని ఏదో అలా వార్తల్లోకెక్కటానికి అలా చేస్తున్నారని పలువురు నేతలు అంటున్నారు.