కాంగ్రెస్ లో చేరిక పై కొత్త ట్విస్ట్ ఇచ్చిన డిఎస్

తాను కాంగ్రెస్ లో చేరికపై డిఎస్ ట్విస్టిచ్చారు. డిఎస్ తో పాటు నర్సారెడ్డి, రాములునాయక్ కాంగ్రెస్ లో చేరుతున్నారని గత రెండు రోజులుగా వార్తలు షికార్లు చేశాయి. అయితే రాములు నాయక్ , నర్సారెడ్డి అధికారికంగా కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ శనివారం ఉదయం రాహుల్ గాంధీని కలిసినప్పటికి కూడా తాను కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి అందరిని షాక్ క గురిచేశారు. రాహుల్ ను మర్యాద పూర్వకంగానే కలిశాను తప్ప  తాను కాంగ్రెస్ లో చేరలేదన్నారు.

తాను ఏం నిర్ణయం తీసుకున్నానో మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదని డిఎస్ అన్నారు. సమయం వచ్చినప్పుడు తన రాజకీయ భవిష్యత్తు పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. అయితే డిఎస్ చెప్పిన మాటలతో అంతా ఆశ్చర్య వ్యక్తం చేశారు. డిఎస్ తన ఎంపీ పదవి కోసమే అలా చేశారని అంతా చర్చించుకున్నారు. ఎంపీ పదవిని కాపాడుకోవడం కోసం డిఎస్ కాంగ్రెస్ లో చేరలేదని చెప్పారని పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

డిఎస్ టిఆర్ ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ లో చేరుతారనన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన అనూహ్యంగా టిఆర్ ఎస్ లో చేరారు. దీంతో కేసీఆర్ డిఎస్ రాజ్యసభ పదవి కట్టబెట్టారు. టిఆర్ ఎస్ అధిష్టానం పట్టించుకోవటం లేదనే అసంతృప్తితో డిఎస్ ఉన్నారు. ఈ సమయంలోనే డిఎస్ కుమారుడు అరవింద్ బిజెపిలో చేరారు.

దీంతో నిజామాబాద్ టిఆర్ ఎస్ కార్యవర్గం అంతా ఎంపీ కవిత ఆధ్వర్యంలో సమావేశమయ్యి డిఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కుమారుని రాజకీయం కోసం బిజెపికి మద్దతిస్తున్నట్టు వారు చర్చించారు. వెంటనే డిఎస్ ను పార్టీ నుంచి తొలగించాలని కేసీఆ ర్ కు వారు సిఫార్సు  చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోకుండా కేసీఆర్ కొన్నాళ్ల పాటు మౌనం వహించారు. ఆ తర్వాత డిఎస్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో డిఎస్ ను సస్పెండ్ చేస్తూ టిఆర్ ఎస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఇక డిఎస్ కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైందని అంతా అనుకున్నారు.

శనివారం రాహుల్ ని కలిసిన డిఎస్ తాను కాంగ్రెస్ లో చేరలేదని ప్రకటించారు. డిఎస్ తన పదవిని కాపాడుకునేందుకే వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించారని పలువురు చర్చించుకుంటున్నారు.