Today Horoscope : డిసెంబర్‌-17 -మార్గశిర మాసం, గురువారం మీ రాశి ఫ‌లాలు

today horoscope in telugu

మేష రాశి
సోదరులతో మాటపట్టింపులు !

ఈరోజు మీరు చేసే పని పట్ల ఏకాగ్రత ఉంచి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు. ఈరోజు సోదరులతో మాటపట్టింపులు. ఈరోజు ఆవేశంలో మీరు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే, తరువాత మీకు ఇబ్బందులు తప్పవు. ఈరోజు పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఏదైనా ఒప్పందానికి మీరు కనెక్ట్ అయితే అదృష్టం కలిగే అవకాశం ఉంది. శ్రీదత్తత్రేయ కవచం పారాయణం లేదా వినడం చేయండి.

వృషభ రాశి
ఈరోజు వాగ్దానాలు ఇవ్వకండి !

ఈరోజు విలువైన వస్తువులు సేకరిస్తారు. మీరు ఈరోజు ఏ పనిని పూర్తి చేయాలనుకుంటే అది అవ్వకపోవచ్చు. ఈరోజు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటె మంచిది. ఈరోజు ఎవరికీ ఎలాంటి వాగ్దానాలను ఇవ్వకండి. మీరు చేయాలనుకున్న మంచి వలన కొంత ప్రయోజనాన్ని పొందుతారు. సన్నిహితులతో సఖ్యత. డబ్బు వసూలు పనులు పూర్తవుతాయి. సంఘంలో గౌరవం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఈరోజు వ్యాపారవృద్ధి. ఉద్యోగోన్నతి. దైవదర్శనాలు. వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయండి.

మిధున రాశి
ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్త !

మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ఈరోజు మంచి అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. అయితే, పనిలో అదనపు భారం పడుతుంది. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.మీకు ఈరోజు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఈరోజు గృహ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు ఇచ్చే దృఢమైన సలహాలు పనిచేస్తాయి శ్రీదత్త కవచం పారాయణం చేయండి.

కర్కాటక రాశి
దూరపు బంధువుల కలయిక !

ఈరోజు అనుకోని ఖర్చులు.ప్రయాణపు భారం పడే అవకాశం ఉంది. ఈరోజు దూరపు బంధువుల కలయిక. ఈరోజు మీకు ఇష్టమైన వ్యక్తిని కలుస్తారు. ఈరోజు కొన్ని ఇబందులు ఎదురైనా ఓర్చుకుంటారు. రాబోయే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు అదనపు బాధ్యతలు కలిసొస్తాయి. ఈరోజు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఆరోగ్య జీవితం కోసం ఆదిత్యహృదయం పారాయనం చేయండి.

సింహ రాశి
ఆకస్మిక ప్రయాణాలు !

ఈరోజు అనవసరంగా ఖర్చు చేయవద్దు.రుణయత్నాలు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు మీకు వచ్చిన అవకాశాలు మీకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. ఈరోజు వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మీరు మీ చుట్టూ ఉన్న అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీ చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోండి. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఈరోజు వివాదాలకు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. బెల్లం, శనగల లను గోవులకు అందించడం చేయండి. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

కన్య రాశి
ఈరోజు బంధువుల గురించి ఆందోళన !

ఈరోజు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీరు చేయాలనుకున్న పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పలుకుబడి పెరుగుతుంది.ధనలాభం. ఈరోజు ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఇంట్లో గొడవ జరిగే అవకాశం ఉంది. ఈరోజు కుటుంబం, బంధువుల గురించి కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మంచి కుటుంబ జీవితానికి శ్రీ లక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

today horoscope in telugu

తుల రాశి
ఈరోజు ఉద్యోగాలలో ఒత్తిడులు !

ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడుపుతారు. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆర్ధిక వృద్ధి కోసం ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి
పోటీపరీక్షల్లో విజయం !

ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం. ఈరోజు వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
ముఖ్యమైన పత్రాలను పని ప్రదేశంలోనే ఉంచుకోండి. లేకపోతె ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఈరోజు పోటీపరీక్షల్లో విజయం. ఈరోజు మీకు ఇష్టమైన వారు కలత చెందుతారు. అయితే, మీ పరిస్థితిని వారికి వివరించి సర్దిచెప్పుకోవాల్సి ఉంటుంది. విందువినోదాలు. వాహనయోగం. ఈరోజు సూర్యనమస్కారాలు చేయండి.

ధనుస్సు రాశి
ఆకస్మిక ప్రయాణాలు !

మీరు కొత్త ఉద్యోగం చేయాలనుకున్న, వ్యాపారం ప్రారంభించాలనుకున్న మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సాయం తీసుకోండి. అది మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఈరోజు పనులు వాయిదా వేస్తారు. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు. ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఈరోజు బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఈరోజు మీ స్థాయిలో మీరు ఏమి చేయాలో అది సకాలంలో పూర్తి చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.

మకర రాశి
తగాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఏదైనా సమావేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీపై కొంతమంది దృష్టి పడుతుంది. ఈరోజు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు గందరగోళానికి గురి కాకండి. ఈరోజు అనవసర ఖర్చులు చేయవద్దు. కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. అత్యంత కీలక సమాచారం. విందువినోదాలు. ఈరోజు అవసరమైనవారికి ఆహారాన్ని ఇవ్వండి.

కుంభ రాశి
సన్నిహితుల నుంచి శుభవార్తలు!

ఈరోజు సమస్యలు కొంత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. ఈరోజు మీరు గతంలో అనుకున్న సంకల్పాలను నెరవేర్చుకోవడానికి ఇది తగిన సమయం. ఈరోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. రాబోయే కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి. 

మీన రాశి
అనుకోని ప్రయాణాలు !

ఈరోజు ఉద్యోగులకు బాధ్యతలు అధికం. ఈరోజు చాలా కాలం తరువాత, మీ దైనందిన జీవితం మారబోతోంది. ఈరోజు పదోన్నతులు మీ ఇంటి గడపకు వస్తాయి. ఈరోజు కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ దినచర్యలో కొత్త మార్పులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఈరోజు అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. సాయిబాబా చరిత్రను పారాయణం చేయండి.