Home News కేసీఆర్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఈటల

కేసీఆర్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఈటల

హుజురాబాద్‌: ఉప ఎన్నిక పాదయాత్రలో భాగంగా శనివారం ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఈటెల తనపై కెసీఆర్ చేసిన ఆరోపణలకు తనదైన శైలిలో జవాబిచ్చారు. దళిత బంధుపై కేసీఆర్ హుజురాబాద్‌లోని ఓ పిల్లాడితో మాట్లాడాడంటూ సెటైర్లు వేశారు. ఎదురించేవాళ్లంతా కేసీఆర్‌కు చిన్న మనుషులులానే కనిపిస్తారని, ఆయన తానొక పెద్ద మేధావి, పెద్ద మనిషి అనుకుంటూ ఉంటారని విమర్శించారు. కానీ “చలి చీమల చేత చిక్కి చావదే సుమతి” అన్న మాటను కేసీఆర్ గుర్తుచేసుకోవాలని హేచ్చరించారు.

Etela Rajender Satires On Kcr

ఆరుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ధర్మంగానే గెలిచానని ఈటల అన్నారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన అన్నారు. తన పక్కన ఎవరూ ఉండకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని, వారు డబ్బు, అధికారాన్ని నమ్మితే తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే… మరి, అదే బీఫాంతో పోటీ చేసిన కెసిఆర్ కూతురు కవిత ఎందుకు ఓడిపోయారని గూబ గుయ్యమనేలా ప్రశ్నించారు. 2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఖాయమని ఈటల జోస్యం చెప్పారు.

Related Posts

జనంలోకి జనసేనాని.. జనసైనికుల్లో జోష్ వస్తుందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత జనంలోకి వెళ్ళబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్లను బాగు చేసేందుకు శ్రమదానం చేయనున్నారట జనసేన అధినేత. ఈ మేరకు పార్టీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. అక్టోబర్...

బిగ్ బాస్ తెలుగు: అప్పుడు అవినాష్, ఇప్పుడు రవి.!

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు సీజన్ 5 విషయానికొస్తే, చిత్ర విచిత్రంగా కనిపిస్తోంది కంటెస్టెంట్ల తీరు బిగ్ హౌస్‌లో. సుదీర్ఘమైన నామినేషన్ల ప్రక్రియ.. సుదీర్ఘమైన టాస్కులు.. ఇవేవీ వీక్షకులకు 'కిక్కు' ఇవ్వలేకపోతున్నాయి....

Related Posts

Latest News