బ్రేకింగ్ న్యూస్ : కాంగ్రెస్ జగ్గారెడ్డికి గుడ్ న్యూస్

14 ఏండ్ల క్రితం నాటి కేసులో అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి శుభవార్త. ఆయన అభిమానులకు కూడా గుడ్ న్యూస్. 

జైలులో ఉన్న జగ్గారెడ్డికి సికింద్రాబాద్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టయి చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. 

జగ్గారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారించిన సికింద్రాబాద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జగ్గారెడ్డి ఇవాళ సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశాలున్నట్లు న్యాయవాదులు తెలిపారు.

జగ్గారెడ్డి ఈనెల 11 వ తేదీ సోమవారం రాత్రి పటాన్ చెరులో అరెస్టు చేశారు. అప్పుడు రిమాండ్ కు తరలించింది న్యాయస్థానం. 12 రోజుల తర్వాత జగ్గారెడ్డికి బెయిల్ మంజూరైంది. 50వేల రూపాయలు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఆదివారం సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 

టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు జగ్గారెడ్డికి మధ్య తీవ్రమైన వైరం ఉంది. జగ్గారెడ్డి గతంలో టిఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కానీ అప్పటి సిఎం వైఎస్సార్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా టిఆర్ఎస్ లో అసమ్మతి నేతగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకుని ఎమ్మెల్యేగా అయ్యారు.

జగ్గారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో తప్పుడు మార్గంలో మనుషులను అమెరికా తరలించినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఆ కేసులో ఇప్పుడు కదలికలు వచ్చాయి. నార్త్ జోన్ పోలీసులు జగ్గారెడ్డిని పటాన్ చెరు సమీపంలో అరెస్టు చేశారు. 

ఇప్పుడు జగ్గారెడ్డికి బెయిల్ మంజూరు కావడంతో బయటకు రాగానే గతంలో రేవంత్ రెడ్డి మాదిరిగానే జగ్గారెడ్డి కూడా కేసిఆర్ మీద విరుచుకుపడే చాన్స్ ఉందని చెబుతున్నారు. కేసిఆర్, జగ్గారెడ్డి ఇద్దరూ టిఆర్ఎస్ లో ఉన్న కాలంలో కేసిఆర్ చర్యలపై జగ్గారెడ్డి మాట్లాడే చాన్స్ ఉందని అంటున్నారు.  

 

Jaggareddy ki bail manjuru…50velu 2 surities….every Sunday market ps lo signiture cheyali…8weeks varaku