షర్మిల చేసిన పనికి జూ.ఎన్టీఆర్ బుక్కయ్యాడే 

Sharmila effect on Junior NTR
వైఎస్ జగన్ సోదరి షర్మిల ఏపీని వదిలేసి తెలంగాణ పొలిటికల్ పార్టీ పెట్టవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తవమవుతున్నాయి.  ఇది ఆమె సొంత ఆలోచన కాదని, వెనుక పెద్ద తలలు ఉన్నాయని అంటున్నారు.  ప్రధానంగా మోడీ పేరు వినిపిస్తోంది.  కేవలం కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికే షర్మిల చేత పార్టీ పుట్టిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ చెబుతోంది.  వైఎస్ఆర్ పేరును వాడుకుని రెడ్డి సామాజికవర్గం ఓట్లను చీల్చే కుట్ర జరుగుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేరుగా ఈ మాట అనలేదు కానీ షర్మిల ఏదైనా సహాయం కావాలని వస్తే చేస్తాం కానీ ఇలా అధికారం చేపడతామని వస్తే మాత్రం ఒప్పుకోమని అనేశారు.
Sharmila effect on Junior NTR
ఇక మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ వైఎస్ షర్మిల బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వదిలిన బాణమే అని, బీజేపీ  డైరెక్షన్లోనే ఆమె పార్టీ పెడుతున్నారని అన్నారు.  బీజేపీ ఉత్తర భారతదేశంలో ప్రభావం కోల్పోతోందని.. అందుకే దక్షిణ భారతదేశంపై ఫోకస్ చేశారని, ఇదంతా సెటిలర్లను షర్మిల వైపుకు తిప్పేందుకు ప్రయత్నాలు  జరుగున్నాయని, ఇలావ షర్మిల వచ్చింది, రేపు జూ.ఎన్టీఆర్ వచ్చి పార్టీ పెడతాను అంటారు.  లేకపోతె నందమూరి కుటుంబం నుండి వేరెవరో వచ్చి పార్టీ పెడతాను అంటారు, అంతమాత్రం దానికి తెలంగాణను సాధించుకోవడం ఎందుకు అంటూ సెంటిమెంట్ రగిల్చేలా మాట్లాడారు.   
 
జూ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మీద ఎన్నో ఏళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది.  ఆయన పార్టీలోకి రావాలని తెలుగుదేశంలో ఉన్న నందమూరి వీరాభిమానులు కోరుతున్నారు.  కానీ గతంలో చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందో రుచి చూసిన తారక్ మళ్ళీ ఆ పార్టీవైపు చూడలేదు.  చూస్తారా అంటే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి.  ఆయన తనపాటికి తాను సినిమాలు చేసుకుంటున్నారు.  భవిష్యత్తులో అనీ చూసుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.  నందమూరి అభిమానులు హీరోగా ఎన్టీఆర్ ను ఎంత ఆరాధించినా చివరకు ఆయన్ను రాజకీయ నాయకుడిగానే చూడాలని ఆశిస్తున్నారు.  అలాంటి వ్యక్తి మీద ఇప్పటి నుండే రాజకీయ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు పుట్టుకురావడం ఇబ్బందికర విషయమే.