దుబ్బాకలో, గ్రేటర్ ఎన్నికల్లో చేయలేని పనిని కాంగ్రెస్ ఇప్పుడు చేస్తోంది

Congress plan to grab people's attention 

కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే మొన్నటివరకు జనం చాలా లైట్ తీసుకునేవారు. తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లిపోయాయనే అభిప్త్రాయం ఇందేది జనంలో.  అందుకే హస్తం నేతలను అస్సలు పట్టించుకోలేదు. ప్రజల ఫోకస్ మొత్తం బీజేపీ, తెరాసాల మీదే ఉండేది.  అదే దుబ్బాకలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమికి కారణం. ఓటమి సంగతి పక్కనపెడితే పోలైన ఓట్ శాతం కూడ ఘోరంగా ఉంది.  గెలవడం సంగతి అటుంచితే ఉనికిని కాపాడుకుంటే చాలానే పరిస్థితి.  కొన్ని నెలల వరకు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ అనేవారు. అయితే బీజేపీ బలపడటంతో ఆ ఉద్దేశ్యం మారిపోయింది.  ఇంకెక్కడి కాంగ్రెస్ బీజేపీ వచ్చేసిందిగా అని మాట్లాడుకున్న జనం దుబ్బాక,  గ్రేటర్ ఎన్నికల్లో కమలానికి పట్టం కట్టారు. 

Congress plan to grab people’s attention

అలా పబ్లిసిటీకి, ప్రజల్లో గుర్తింపుకు దూరమై కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది.  కాంగ్రెస్ పార్టీకి పట్టిన స్థితి చూస్తే జనం మాట్లాడుకోవడం మానేశారు అంటే అది ఇంతపెద్ద చరిత్ర కలిగిన పార్టీ అయినా, అందులో ఎంతమంది సీనియర్ నాయకులున్నా కూలిపోవాల్సిందేనని అర్థమవుతోంది.  ఈ సంగతి కాంగ్రెస్ నేతలకు కూడ తెలిసొచ్చిందో ఏమో కానీ ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్లు మొదలుపెట్టారు.  పార్టీకి హైప్ తెచ్చుకునే పనిలో పడ్డారు.  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంశం కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక.  ఈ విషయమై చాలా నెలల నుండి సందిగ్దత నడుస్తోంది.  నిజానికి ఈపాటికి ఈ ఇష్యు సెటిలైపోవాలి. కానీ కాలేదు.  

ఉద్దేశ్యపూర్వకంగానే నాన్చుతున్నారనే అనుమానం కలుగుతోంది.  అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా సీనియర్ నాయకులు వీ హనుమంతరావు, జగ్గారెడ్డిలు కూడ పోటీపడుతున్నారు.  హైకమాండ్ మనసు మొత్తం రేవంత్ మీదే ఉంది.  ఒకవేళ అనూహ్యంగా డెసిషన్  మారినా కోమటిరెడ్డికి అవకాశం ఇస్తారు.  అంతేకానీ వేరే సీనియర్లు ఎవ్వరికీ పదవి దక్కదు.  ఈ సంగతి వారికి కూడ తెలుసు.  కానీ పదవి ఇవ్వకపోతే పార్టీని వీడతామని ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తున్నారు.  ఇందుకు కారణం రాద్ధాంతం చేస్తే జనం దృష్టి పార్టీ మీదకు షిఫ్ట్ అవుతుందనే ఆశ.  అందుకే ఈ డ్రామా కొట్లాటలు.  పీసీసీ చీఫ్ విషయంలో గొడవపడటం కాంగ్రెస్ నేతలకు కొత్తేమీ కాదు.  గతంలో పలుమార్లు ఇలాగే జరిగింది.  ఎవరికి పదవి ఇచ్చినా ఇంకొకరు అభ్యంతరం చెప్పేవారు.  

కానీ అప్పట్లో గొడవలు హైలెట్ కాకుండా అంతర్గతంగానే జరిగిపోయేది ఎంపిక.  బయటకు తెలిస్తే పరువుపోతుందని ఆలోచించేవారు.  కానీ ఈసారి రచ్చకెక్కింది.  ఎక్కింది అనడం కంటే ఎక్కించారు అనాలి.   పరువు గిరువు పక్కనపెట్టి పబ్లిసిటీ కావాలంటూ గొడవపడుతున్నారు.  ఈ గొడవను జనం ఆసక్తిగా గమనిస్తున్నారు.  ఇంత రచ్చ జరుగుతోందే ఇంతకీ కొత్త అధ్యక్షుడు ఎవరై ఉంటారా అని కళ్ళు కాయలు చేసుకుని చూస్తున్నారు.  ఇలా జరగాలని, రాబోయే నాయకుడికి హైప్ రావాలనే కాంగ్రెస్ నేతలు గొడవలు చేసుకుంటున్నట్టు ఉన్నారు.