నిండా మునిగాక ఈ కాంగ్రెస్సోళ్లకి చలి ఎందుకు ?

Congres cadres unhappy with high command
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ నందు తుడిచిపెట్టుకుని పోయింది కాంగ్రెస్ పార్టీ.  ప్రస్తుతం చెప్పుకోవడానికి ఇద్దరు ముగ్గురు లీడర్ల పేర్లు తప్ప ఆ పార్టీలో వేరే లీడర్లు ఎవ్వరూ లేరు.  గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్ షేర్ వచ్చింది వీరికి.  రాష్ట్రాన్ని విడదీసేటప్పుడే ఏపీ మీద ఆశలు వైలేసుకున్న హస్తం పార్టీ తెలంగాణలో అధికారం దక్కించుకుంటామనే అపోహలో ఉండేది.  కానీ అక్కడా ఆశలు గల్లంతయ్యాయి.  ప్రత్యేక తెలనాజ్ఞ వచ్చి ఏడేళ్లకు పైగానే  గడిచిపోయినా ఇప్పటికీ  పుంజుకోలేదు.  పైగా నానాటికీ కుంగిపోతూ వస్తోంది.  2014 ఎన్నికల్లో కేసీఆర్ హవా ముందు నిలబడలేకపోయిన కాంగ్రెస్ 2018 ఎన్నికల్లో ఇంకా దిగజారింది.  ఇదంతా ఒక ఎత్తైతే సొంత నాయకుల స్వీయ తప్పిదాలు పార్టీని జనంలో మరింత పలుచన చేసేశాయి. 
 
Congres cadres unhappy with high command
Congres cadres unhappy with high command
పదవుల కోసం నాయకులు కొట్టుకుంటున్న వైనం ప్రజలకే కాదు కాంగ్రెస్ శ్రేణులకు కూడ చికాకు తెప్పిస్తోంది.  ఏడాది కాలం నుండి పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నడుస్తోంది.  రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వాలని అధిష్టానం చూస్తుంటే ససేమిరా కుదరదని అంటున్నారు సీనియర్లు.  కోమటిరెడ్డి, వీహెచ్, జగ్గా రెడ్డి లాంటి లీడర్లు పదవి మాకిమ్మంటే మాకిమ్మని అధిష్టానం మీద ఒత్తిడి తెస్తున్నారు.  గతంలో సోనియా గాంధీ ఏది చెబితే అదే శాసనంగా నడిచిన పార్టీలో ఈరోజు ఆమె నిర్ణయానికి కనీస విలువ కూడా లేకుండా పోయింది.  దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే పీసీసీ చీఫ్ పదవిలో రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టాలనుకోగా సీనియర్లు పార్టీని వీడతామని బెదిరించడంతో వెనక్కు తగ్గింది అధిష్టానం.  సీనియర్లకు కోపం వస్తే ఉప ఎన్నికల్లో దెబ్బ తింటామని హైకమాండ్ వెనక్కి తగ్గింది. 
 
కానీ తీరా చూస్తే అక్కడ అంత సీన్ లేదని తేలిపోయింది.  సీనియర్ లీడర్లంతా దుబ్బాకలో మకాం వేసినా పార్టీని కనీసం రెండవ స్థానంలో కూడ నిలబెట్టలేకపోయారు.  సరే గ్రేటర్ ఎన్నికలకు ముందైనా రేవంత్ రెడ్డికు వేరొకరికో పగ్గాలు ఇస్తారని అనుకుంటే అదీ జరగలేదు.  అక్కడా భయమే.  బట్.. దుబ్బాక సీన్ రిపీట్ అయింది.  బీజేపీ దూసుకుపోగా హస్తం రెండు స్థానాలకే  పరిమితమైంది.  ఇక త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి సందిగ్దత నెలకొంది.  ఎన్నికల సమయానికి కొత్త అదేక్షుడి నియామకం పార్టీలో కొత్త జోష్ ఇస్తుందని శ్రేణులు ఆశపడ్డాయి.  కానీ అధిష్టానం సాగర్ ఎన్నికల కారణం చూపి ఎంపికను వాయిదావేసింది. ఇప్పుడు గనుక పొరపాటి నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోవలసి ఉంటుందని భయపడుతున్నారట. 
 
ఈ తంతు మొత్తాన్ని చూసిన శ్రేణులు వరుస పెట్టి అన్ని ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే బలం లేదని తేలిపోయింది.  రేపు సాగర్ ఎన్నికల్లో కూడ తప్పకుండా గెలుస్తామనే ధీమా ఒక్కరిలో కూడ లేదు.  ఇక దెబ్బ తినడానికి, నష్టపోవడానికి ఏమీ లేదు.  నిండా మునిగినోళ్లకు చలి ఎందుకు.  ఇప్పుడేదో తప్పు జరిగిపోతుందని, ఓటు బ్యాంక్ కూలుతుందని సామాజిక సమీకరణాలు అవీ ఇవీ అంటున్నారు.  కొత్త అధ్యక్షుడిని నియమిస్తే కనీసం ఎన్నికలకు ముందు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టైనా ఉంటుంది కదా అంటున్నారు.