తెలంగాణపై దృష్టి పెట్టిన చంద్రబాబు, ఆందోళనలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు

cbn telugurajyam

రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై పూర్తి శ్రద్ద కనపరచలేదు. పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపే చంద్రబాబు నాయుడు పని చేశారు. 2014లో సీఎంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు విధులు నిర్వహించారు కాబట్టి అప్పుడు ఆయన తెలంగాణలో టీడీపీ పరిస్థితిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ 2019లో వచ్చిన ఘోర ఓటమి తరువాత మాత్రం ఆయన తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చెయ్యడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో తన ఓటమికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఒక కారణమని భావించిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ ను దెబ్బతియ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

cbn
cbn

ఇటీవల ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించే ముందు కూడా తెలంగాణాలోనే ఆయన ఆ పని పూర్తి చేశారు. అనుబంధ విభాగాలను కూడా ప్రకటిస్తూ తెలంగాణ టిడిపిలో జోరు చూపిస్తున్నారు. మెచ్చా నాగేశ్వరరావు, నన్నురి నర్సిరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి వంటి వారికి కీలక పదవులు ఇచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే ఆయనను చంద్రబాబు నిబద్దత, క్రమశిక్షణ ఆధారంగా గుర్తించి కీలక బాధ్యత అప్పగించారు. ప్రొఫెసర్ జోత్స్నకి కూడా అధికార ప్రతినిధిగా కీలక అవకాశం ఇచ్చారు. గత కొంతకాలంగా టీవీ చర్చల్లో ఆమె క్రియాశీలంగా ఉంటూ వస్తున్నా విషయం తెలిసిందే. కొత్తగా పార్టీలో చేరినా ఆమెని గుర్తించి పదవి కట్టబెట్టారు. పార్టీలో సీనియర్ అయిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి కూడా మంచి పదవి ఇచ్చారు.

అయితే రానున్న దుబ్బాక ఎన్నికల్లో టీడీపీ నాయకులు పోటీ చేయకుండా తటస్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి బాబు పూర్తి స్థాయిలో పతకం రచించారని తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల కంటే కూడా టీడీపీకి ఎక్కువ క్యాడర్ ఉంది. ఇప్పుడు బాబు తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో అక్కడ ఉన్న నాయకులు కూడా పార్టీ కోసం కష్టపడుతారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు తెలంగాణపై చూపిస్తున్న ఇంట్రెస్ట్ పట్ల టీఆర్ఎస్ నాయకుల కంటే కూడా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎక్కువ కంగారు పడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు పోటీగా నిలవడానికి ఈ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బాబు వాళ్లకు షాక్ ఇచ్చారు. రానున్న రోజుల్లో బాబు తెలంగాణలో ఇంకెన్ని మార్పులు చేస్తారో వేచి చూడాలి.