వార్ వన్ సైడ్… ఏపీ ఎన్నికలపై తాజా సర్వే!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అందుకు అవసరమైన అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలయ్యాయి. ఈ సమయంలో సర్వేల ఫలితాలు సందడి నెలకొంది. ఈ సందర్భంగా తాజాగా ఒక సర్వే వైరల్ గా మారింది.

అవును.. పోలింగ్ గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో… రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి. ఈ సమయంలో… అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా మెజారిటీ సర్వే సంస్థలు అధికార వైసీపీ వైపే ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా నాగన్న సర్వే వెలుగులోకి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపింది. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగింది. వాటన్నింటినీ క్రోడీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు.

ఈ నాగన్న సర్వేలో కూడా వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ 103 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయఢంకా మోగిస్తుందని తెలిపింది. తెలుగుదేశం – జనసేన – భారతీయ జనతాపార్టీకి 39 స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది. ఇక మిగిలిన మరో 33 సీట్లల్లో వైసీపీ – కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందని తెలిపింది. వాటిలో కూడా 20 నుంచి 25 వరకూ వైసీపీకి దక్కే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక లోక్‌ సభ నియోజకవర్గాల విషయానికి వస్తే 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీ విజయ కేతనాన్ని ఎగురవేస్తుందని తెలిపింది. ఇక్కడ కూడా టీడీపీ కూటమికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఇందులో భాగంగా… 4 నుంచి 5 స్థానాల్లో మాత్రమే కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది!

ఇక జిల్లాలవారీగా ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి!:

శ్రీకాకుళం – వైసీపీ 7, టీడీపీ 2, (హోరాహోరీ 2)

విజయనగరం – వైసీపీ 7, టీడీపీ 1, (హోరాహోరీ 1)

విశాఖపట్నం – వైసీపీ 5, టీడీపీ 6, (హోరాహోరీ 4)

తూర్పు గోదావరి – వైసీపీ 6, టీడీపీ 8, (హోరాహోరీ 5)

పశ్చిమ గోదావరి – వైసీపీ 6, టీడీపీ 5, (హోరాహోరీ 4)

కృష్ణా – వైసీపీ 6, టీడీపీ 6, (హోరాహోరీ 4)

గుంటూరు – వైసీపీ 8, టీడీపీ 4, (హోరాహోరీ 5)

ప్రకాశం – వైసీపీ 8, టీడీపీ 2, (హోరాహోరీ 2)

నెల్లూరు – వైసీపీ 9, టీడీపీ 0, (హోరాహోరీ 1)

కడప – వైసీపీ 10, టీడీపీ 0,

కర్నూలు – వైసీపీ 13, టీడీపీ 0, (హోరాహోరీ 1)

అనంతపురం – వైసీపీ 9, టీడీపీ 3, (హోరాహోరీ 2)

చిత్తూరు – వైసీపీ 10, టీడీపీ 2, (హోరాహోరీ 2)