గిలాసల చప్పుళ్లతో కొంగర కలాన్ కు (వీడియో)

కొంగర కలాన్ వద్ద టిఆర్ఎస్ జరప తలపెట్టిన సభ దేశ చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖిస్తుందని పార్టీ నేతలు ఘనంగా చెబుతున్నారు. అంత గొప్ప చరిత్ర లిఖించాలంటే మామూలు ముచ్చట కాదుగదా. మరి జనాలను భారీగా తరలించాల్సిందే.

అందుకోసమే బస్సు బస్సు బస్సుకు మందు బాటిల్ పథకాన్ని ప్రవేశపెట్టిర్రా అన్నట్లుగా ఉంది పరిస్థితి. మందు సీసా సీల్ తియ్య.. గిలాసల పోసి జంపుకుంటూ సభకు హాజరవుుతన్నరు జనాలు.

ఒక బస్సు రన్నింగ్ లో ఉండగానే ఈ నాయకులు, కార్యకర్తలు ఎలా మజా చేస్తున్నరో చూడండి. పైగా తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి అంటూ మందు తాగే వీడియోలు తీసి సోషల్ మీడియాలోకి వదిలారు.

దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కింద వీడియో ఉంది మీరూ లుక్కేయండి. గిలాసల సప్పుళ్లతో చలో కొంగరకలాన్ అంటున్నారు ఈ గులాబీ దళసభ్యులు.

ఇక సుదూర ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల మీద వచ్చిన జనాలు అలసట చెందారేమో. అలసట నుంచి రిలాక్స్ అయ్యేందుకు మార్గ మధ్యంలో ట్రాక్టర్లు ఆపుకుని యాటలు కోసి వంటలు చేసుకుని తిని సభకు తరలి వస్తున్నారు. కింద యాట కోసం వంట చేస్తున్న పార్టీ లీడర్ల పొటో ఉంది చూడండి. ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సబ్సిడీ గొర్రెలను కాసుకునేది వదిలిపెట్టి ఇలా ప్రగతి సభ కోసం కోసుకుని తింటున్నరా అని జనాలు సెటైర్లు వేస్తున్నారు.

గొర్రెపోతు, గ్యాస్ సిలెండర్ వెంట తెచ్చుకుంటున్న ట్రాక్టర్ ప్రయాణీకులు
యాటను కోటి మటన్ కట్ చేస్తున్న గులాబీ దళాలు, పక్కనే అన్నం వండుతున్నారు
మటన్ కట్ చేస్తున్న గులాబీ నేతలు