కేటిఆర్ ను మభ్యపెట్టేందుకే కేసిఆర్ ముందస్తు హడావిడి : రేవంత్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సిఎం పై విమర్శల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ మెర్యూర్ హోటల్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. పలు కీలకమైన అంశాలను రేవంత్ లేవనెత్తారు. ఆయన మాటల్లోనే వివరాలు చదవండి.

కేసీఆర్ ముందస్తు వస్తే ముందే ఓడిపోతాడు. వెనకొస్తే అదే ఓటమి తప్పదు. కేసీఆర్ ఎంతసేపు చిట్టి కథలు చెప్పడానికే  పనికొస్తారు తప్ప పాలనకు పనికిరాడు.  కాదు. కేసీఆర్ భ్రమలు, భ్రాంతిలో ఉన్నారు. వంద సీట్లు గెలిసేట్లయితే ..కేసీఆర్ ఎందుకు ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు ఆరాటపడుతున్నారు? కేసీఆర్ మధ్యయుగాల నాటి చక్రవర్తి. ప్రజలు సామాజిక న్యాయం కోరుతున్నారు.. గోర్లు ,బర్లు, పిట్టలు కాదు. తెలంగాణ కోసం త్యాగాలు చెసింది గోర్లు ,బర్లు ,చేప పిల్లల కోసం కాదు కదా? పేదోళ్ల బిడ్డలు బర్లు ,గోర్లు కాస్తుంటే ..కేసీఆర్ మనుమడు మాత్రం మంత్రి ,ముఖ్యమంత్రి కావాలా?

రాష్ట్ర బడ్జెట్ అంత కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. కెసిఆర్, కేటీఆర్ లు అబద్ధాలు చెప్పడంలో పోటీ అవుతున్నారు. కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యాక రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులు తగ్గాయి. కేసీఆర్ ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ని చేసింది లేదు. గత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సంస్కరణ ల పుణ్యమే దేశ వ్యాప్తంగా ఇప్పుడు మిగులు విద్యుత్ సాధ్యమైంది. రాష్ట్రవిభజన బిల్లులో వినియోగ ఆధారితంగా విద్యుత్ విభజన కు సోనియా ఆమోదం తెలపడం తోనే ..ఇప్పుడు మిగులు విద్యుత్ ఉంది. కాంగ్రెస్ ట్రంప్ కార్డు వస్తది ..అప్పుడు కేసీఆర్ కు కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. సరైన సమయంలో రాహుల్ ఆ ట్రంప్ కార్డును వదులుతాడు. బాహుబలి పాలనకు రావడం .కాలకేయుడు చావడం ఖాయం.

జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలని కేసీఆర్ కు ఇష్టం లేదు. కుల సంఘాల కు భూములు కేటాయిస్తున్న కేసీఆర్ కు జర్నలిస్ట్ లకు ఎందుకు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇండ్లు ఇస్తాం. ఈ అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతాం. చరిత్రలో ఎక్కడ పరాయి పాలన జరుగుతుందో అక్కడ అన్యాయం జరుగుతుంది. నిజాం పాలన నుండి విముక్తి పొందిన తరువాత ఇప్పుడు కొంతమంది తమ చరిత్ర మాత్రమే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. రక్తం చిందించ కుండా తెలంగాణ తెచ్చినం అంటున్న కేసీఆర్ కుటుంబం.. ఎంతమంది ఆత్మార్పణం చేసుకుంటే తెలంగాణ వచ్చిందో చెప్పాలి. మీరే చెప్పారు కదా తెలంగాణ కోసం 1200మంది అమరులు అయ్యారని కానీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. వీరంతా తమ కోసం కాదు తెలంగాణ తల్లి కోసం ప్రాణాలు అర్పించారు.

పేద ప్రజలు చేసే వృత్తులు బర్రెలు, గోర్రెలు, చేపలు కేసీఆర్ కుటుంబం సాకి ఆదర్శంగా నిలవాలి. పేద ప్రజలు బర్రెలు, గొర్లు పెంచాలి. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యం ఎలుతా అంటున్నారు. బంగారు తల్లి పథకం తోక నే కళ్యాణ లక్ష్మీ. కేసీఆర్ కాలగర్భంలో కలిసిన వస్తువు లాంటి వాడు. కేసీఆర్ మాటలు కాలక్షేపం కోసం మాత్రమే చూడాలి. కేటీఆర్ నన్ను ముఖ్యమంత్రిని చేస్తావా లేదంటే మెత్త పెట్టి వత్తి  చంపాలా అంటున్నాడు. అందుకే కొడుకు ను మభ్యపెట్టడానికి కేసీఆర్ ముందస్తు అని హడావుడి చేస్తున్నాడు.

కేసీఆర్ పార్టీ పెట్టిన 6 సంవత్సరాలకు కేటీఆర్ అమెరికా నుండి వచ్చిండు ఆతరువాత కవిత బతుకమ్మ పేరిట దిగింది…వంటావార్పు, చిన్న పాటి ధర్నా లో పాల్గొవడం తప్ప మీరు ఉద్యమం చేసింది ఏముంది. మీ ఇంట్లో ఓక్కరైనా…స్మశానానికి పోయిండ్రా… తెలంగంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఇన్ని రోజులు ఓపిక పట్టాయి. టీఆరెస్ పార్టీ ఎజెండానే ప్రజల ఎజెండాగా మార్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. 108, ఆరోగ్యశ్రీ, నాగార్జున సాగర్ డాం, పింఛన్, ఉచిత కరంట్ ఇవన్నీ సమైక్య పాలకులు చేసిన అభివృద్ధి పనులే కదా? కేసిఆర్ కేబినెట్ లో నమ్మకం లేని మంత్రులు కొనసాగుతున్నారు. కేసీఆర్ దృష్టిలో సామాజిక న్యాయం అంటే తమ కుటుంబ సభ్యులకు కడుపు నిండా భోజనం పెట్టడం అనుకుంటున్నాడు. ఐఎఎస్ అధికారులు కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుతా ఎగురవేశారు.

పౌర హక్కుల కోసం పోరాడే వ్యక్తులను అరెస్ట్ చేసే రోజులు తెలంగాణలో వచ్చాయి అంటే ఎలాంటి పాలన పాలనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాగానే మేధావుల కమిటీ వేస్తానని జెప్పాడు కేసీఆర్. ఒక పత్రిక లాక్కొని జర్నలిస్టులను  రోడ్డు మీద వేసిన పరిస్థితి. మేనిఫెస్టో లోఉన్న ఉన్న అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదు. ఉద్యమంలో చనిపోయిన అమరులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అమరులను గుర్తించడానికి ఎందుకు 51నెలల సమయం సరిపోలేదు,ఇంతవరకు గుర్తించలేదు ఎందుకు? వెయ్యికోట్లతో ప్రగతి భవన్,బుల్లెట్ ఫ్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకున్న నువ్వు అంబెడ్కర్ విగ్రహం,అమరవీరుల స్తూపం నిర్మించడలో ఎందుకు ముందడుగు లేదు. 160 మంది జర్నలిస్టులు హెల్త్ స్కీం లేక, పని వత్తిడి కి గురై మరణించారు.

నిన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేసారు. ట్రాక్టర్ లతో మందు; చిందులతో జనాలు వచ్చినా కేసీఆర్ లో పాత వాడి వేడి తగ్గింది. కేసీఆర్ లో ఆత్మ విశ్వాసము సన్నగిల్లింది. సమైక్య వాది అయిన హరికృష్ణ కు అధికార లాంచనాలతో ప్రభుత్వం అంతక్రియలు నిర్వహించింది. మరి చనిపోయిన  తెలంగాణ ఉద్యమకారులకు ఆ విలువ ఏందుకు ఇవ్వలేదు. ఏన్టిఆర్ పేరును విమానాశ్రయం కు పెట్టడానికి ఓప్పుకోని కేసీఆర్… హరికృష్ణ కు స్మారకచిహ్నం కడతా అని అన్నాడంటె ఓట్ల కోసం ఏంత దిగజారి రాజకీయం చేస్తున్నాడో అర్దం చేసుకోవచ్చు. ప్రగతి నివేదన అనే కంటే పుత్రుడి నివేదిక అనొచ్చు. కేటీఆర్, హరీష్, కేసీఆర్, కవిత మధ్య సమన్వయ లోపం కనిపించింది.

కేసీఆర్ కు ప్రతి అరగంటకు సమాచారం తెలుసుకొనే అలవాటు అందుకే నిన్న సభా నిర్వహణలో కొడుకు ఫెయిల్ అయినాడు. ఇంటి ఇంటికి నల్ల ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ విధించే ఏ శిక్షకైనాసిద్దం. సంక్షేమం అంటె చివరి పేదవాడి కి ప్రతీ రూపాయి అందించడమే. కేసీఆర్ చెప్పే పథకాలు ఆరంభ శురత్వమే. ఏమీ చేయకుండానే అన్నే చేసాను అని చెప్పుకొనే వ్యక్తి కేసీఆర్. ఆర్థిక  అభివృద్ధికి కేసీఆర్ కు ఎం సంబంధం. మిగులు బడ్జెట్ రాష్ట్రం లో నువ్వు చేసే న పని ఏదైనా ఉంటే చెప్పు. విద్యుత్ ఇప్పుడు సరిపోయినంత ఉంది దేశంలో. వారి బంధువులు, మిత్రుల కోసం ప్రయివేట్ విద్యుత్ సంస్థల నుంచి కరంట్ కొని, విద్యుత్ సంస్థలను దివాలా పాలు చేస్తున్నాడు. ఆరోజులలో కిరణ కుమార్ రెడ్డి  తెలంగాణ చీకటి అవుతుంది అని చెప్పిన మాటలు నిజమే.