తెలంగాణలో బీజేపీకి దేవతల అనుగ్రహం ఉన్నట్టుంది !?

Bandi Sanjay open warning to KCR

తెలంగాణ భారతీయ జనతా పార్టీ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. అవకాశం మన దగ్గరకే వస్తుందిలే అని ఎదురుచూస్తూ కూర్చోవడం అనే పాత పద్దతికి స్వస్తి చెప్పి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడమనే కొత్త పంథాను పట్టుకున్నారు. ఆ పద్దతే వారిని అనూహ్యంగా రాష్ట్రంలో పుంజుకునేలా చేసింది. దొరికిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు వారు. ప్రధానంగా ఎంఐఎంను సాకుగా చూపి తెరాసను దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో పైచేయలేదు కానీ ఇతర చోట్ల గొప్పగా వర్కవుట్ అయింది. తమ మూల సిద్ధాంతమైన హిందూత్వాన్ని బీజేపీ నేతలు బండి సంజయ్ బలంగా జనం మీద ప్రయోగించగలిగారు. ఇందుకోసం దేవాలయాలను సైతం వాడుకున్నారు.

Bandi Sanjay open warning to KCR
Bandi Sanjay open warning to KCR

ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్కా ప్రణాళికతో ముస్లిం ప్రభావిత ప్రాంతమైన చార్మినార్ ఏరియాలో పర్యటనను ప్లాన్ చేసుకున్న బండి సంజయ్ అక్కడి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వేదికగా స్ట్రాటజీని ప్రయోగించారు. వరద సాయం అర్థాంతరంగా నిలిచిపోవడంతో తెరాస, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. కావాలనే సహాయాన్ని నిలిపివేశారని బండి సంజయ్ ఆరోపిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఆపుచేయించిందని, దాని వెనుక బండి సంజయ్ హస్తం ఉందని అన్నారు. దీంతో బండి సంజయ్ శివాలెత్తి చార్మినార్ ఏరియాలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చి తాము చెప్పేది నిజమేనని కేసీఆర్ ఒట్టు పెట్టాలని శవాల విసిరారు. రాను కూడ ఒట్టు వేస్తానని అన్నారు. అన్నట్టే చార్మినార్ వెళ్లి అమ్మవారి దేవాలయంలో ఒట్టు వేసి అక్కడి నుండే కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు.

ఈ ఆలయం ఎపిసోడ్ చాలా బాగా పనిచేసింది. చాలామందిని ప్రభావితం చేసి బీజేపీకి ఓట్లు పడేలా చేసింది. ఆ దెబ్బతో బండి సంజయ్ ధైర్య సాహసాలను అందరూ కొనియాడారు. ఇలాంటి అవకాశమే మరొకటి వచ్చింది బీజేపీకి. అయితే ఈసారి కాళీమాత. పాతబస్తీ ఏరియా అయిన ఉప్పుగూడలో కాళీమాత దేవాలయ భూముల విషయమై చాలాకాలం నుండి వివాదం నడుస్తూనే ఉంది. కొందరు ప్రైవేట్ వ్యక్తులు 7 ఎకరాలకు పైగా ఉన్నా ఆ భూమి మీద కన్నేశారు. అనేకసార్లు ఆక్రమించాలని ప్రయత్నించారు. తాజాగా ఒక వ్యక్తి హైకోర్టు ఆదేశాలను కాదని కింది కోర్టు ఉత్తర్వులు పట్టుకొచ్చి ఆ భూమిని ప్రభుత్వం తనకు అమ్మిందంటూ నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు చేయగా స్థానికులు, బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులొచ్చి సదరు వ్యక్తి వద్ద కోర్టు ఆర్డర్ ఉందంటూ జనాలకు, కార్యకర్తలను అడ్డగించారు. దీంతో వివాదం పెద్దదైంది. పోలీసులు బీజేపీ వాళ్ళను అరెస్ట్ చేశారు.

ఇలాంటి తరుణం కోసమే ఎదురుచూస్తున్న బీజేపీ నేతలు సంగతి తెలిసి సింహాల్లా రంగంలోకి దూకేశారు. మొదట రాజాసింగ్ ఆలయం వద్దకు చేరుకొని పోలీసులను వారించే ప్రయత్నం చేస్తుండగా రెండవ స్టెప్ అన్నట్టు ముఖ్యుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. రాజాసింగ్, ఇంకొందరు నేతలతో, కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషనుకు బయలుదేరారు. మధ్యలో పోలీసులతో గొడవ కూడ అయింది, అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని, పోలీసులను, ఎంఐఎంను ఏకిపారేశారు. కాళీమాత ఆలయ ఘటనపై 24 గంటల్లో సీఎం, డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించాలని, స్పందించకపోతే ఉద్యమం తప్పదని, పాతబస్తీలో బీజేపీ చేపట్టబోయే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కేసీఆర్ తాను హిందువో.. బొందువో తేల్చుకోవాలని తమ సహనం నశిస్తే పాతబస్తీ ఏమవుతోందో పోలీసులు గుర్తుంచుకోవాలని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.