తెలంగాణ కాంగ్రెస్ కుర్రోడికి అరుదైన గౌరవం

తెలంగాణా కాంగ్రెస్ యువనేత, టిపిసిపి బిసి సెల్ ఛైైర్మన్ శ్రీకాంత్ గౌడ్ కి ఢిల్లీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ లో అరుదైన గుర్తింపు లభించింది.

పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  శ్రీకాంత్ కి ప్రాజక్ట్ శక్తి అవార్డు అందచేశారు.  ప్రాజక్టు  శక్తి అనేది రాహుల్  పార్టీ అధ్యక్షుడయ్యాక రూపొందించిన వినూత్న కార్యక్రమం. టెక్నాలజీ ఉపయోగించి పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయిల పనిచేేసే కార్యకర్తలతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. దీనికొక యాప్ ఉంటుంది. శక్తి  ప్రాజక్టుకు అనేక అర్హతలనుబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నమోదు చేయాలి. ఇలా ఒక సారి నమోదయిన వారితో  రాహుల్ గాంధీ నేరుగా ఫోన్ ద్వారా లేదా, మెసెంజర్ ద్వారా లేదో వీడియో చాటింగ్ ద్వారా  పలకరించి పార్టీ కార్యక్రమాల గురించి వాకబు చేస్తారు. పార్టీ కార్యక్రమాలు స్వయంగా వివరిస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఎక్కడో మారుమూల అట్టడుగున అడ్రసు లేకుండా పని చేస్తున్న వ్యక్తులతో్ పార్టీ నేతల ప్రమేయం లేకుండా ‘హలో’ అని పలకరించే  పద్ధతి ఏ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ మ ాత్రమే ఐటి ఉపయోగించి ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. పార్టీ నేతలంతా ఈ ప్రాజక్టుకు అర్హులయిన వారిని నమోదు చేయాల్సి ఉంటుంది. పార్టీ మెంబర్షిప్ లాగా ఇందులో బోగస్ రిజస్ట్రేషన్ చేయించడానిక ిీవీల్లేదు. కచ్చితంగా, నిజమయిన, నిజాయితీ ఉన్న కార్యకర్తల పేర్లే నమోదు చేయాలి. వోటర్ కార్డు ఆధారంగా నమోదు జరుగుతంది. బోగస్ చేస్తే, రాహుల్ ఫోన్ చేసినపుడు ‘అబ్బెబ్బె’ అని నోరెల్ల బెడితే, నమోదు చేసిన వాడి పని ఫినిష్.

రాహుల్ గాంధీ దీనిని చాలా దూరదృష్టితో రూపొందించారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టపరిచేందుకు చాలా కాలంగా కృషి చేస్తూ, పార్టీ కంటూ ఒక అభిమానుల సైన్యాన్ని తయారు చేసుకున్న నాయకులే నిజమయిన కాంగ్రెస్ సైనికులను శక్తి  ప్రాజక్టుకు నమోదు చేయించగలరు. అంటే, శక్తి ప్రాజక్టు ను విజయవంతంగా అమలు చేయగలగిన ‘శక్తి’ నిజమయిన , నియోజవర్గంలో పట్టు ఉన్న, అనుచరులు ఉన్న నేత కే సాధ్యం. ఇది లీడర్  పలుకుబడికి ఒక నిదర్శనం కూడా.

నూతి శ్రీకాంత్ గౌడ్  ఇక్కడే విజయవంతమయ్యాడు. హైదరాబాద్ అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన శ్రీ కాంత్  గౌడ్ , రాహ ుల్ గాంధీ ‘శక్తి’ కి 13 వేల మందిని నమోదచేయించారు. ఇది తెలంగాణలో నే కాదు, మొత్తం దక్షిణ భారతదేశంలోనే టాప్. అందుకే శనివారం నాడు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ  అంబర్ కుర్రోడిని ప్రత్యేకంగా ప్రశంసించి ‘శక్తి’అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబర్, మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా తదితరులున్నారు. 

ఇది ఎవరో సిఫార్సు చే్స్తే వచ్చిన అవార్డు కాదు, కృషిని రాహుల్ గాంధీ టీం స్వయంగా పరిశీలించిన ఇచ్చిన అవార్డు.

సీనియర్ల తో కిటకిట లాడే శ్రీకాంత్  తెలంగాణ కాంగ్రెస్ లో చాలా చాలా పిల్లగాడు. అయితే, అతను పిడుగవ్వాలనుకుని అంబర్ పేట్ నియోజవర్గాన్ని ఎన్నుకుని అక్కడ పనిచేయడం మొదలుపెట్టాడు. అంబర్ పేరు కాంగ్రెస్ పార్టీకి అందనంత ఎత్తులో ఉంది.  అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎపుడు గెలిచిందో ఈ కాలం పోరగాళ్లకు ఎరికేలేదు. ఎపుడు బిజెపియే గెలుస్తూ ఉంది. బిజెపి నేత కిషన్ రెడ్డి తిష్టవేసి కూర్చున్నారు. ఆయన్ని కదిలించేశక్తి ఏ సీనియర్ నాయకుడికి లేకుండా పోయింది. అలాంటి చోట  శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ తరఫున పని ప్రారంభించారు. సాధారనంగా శ్రీకాంత్ లాంటి చలాకైన కుర్రవాడు రూలింగ్ పార్టీలోకి ఎపుడో జంపయిపోయుండాలి. శ్రీకాంత్ ఆ పని చేయలేదు. కాంగ్రెస్ కు ఫ్యూచర్ ఉందని, కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తుందని మనసావాచా నమ్ముతాడు. 2019 అంబర్ పేటలో కాంగ్రెస్ జండా ఎగురుతుందంటాడు. ఆ దీక్షతో పని మొదలుపెట్టాడు.

నాలుగేళ్లుగా ఒకటే పని.కాంగ్రెస్ పార్టీని ఇంటింటికి తీసుకెళ్లడం. దీనికోసం కాంగ్రెస్ అభిమానులతో ఒక సైన్యం తయారు చేసుకున్నారు. గల్లీ గల్లీలో శ్రీకాంత్ సైన్యం కనిపిస్తుంది. ఇల్లిళ్లూ తిరగడం, కాంగ్రెస్ గురించి చెప్పడం, గల్లీ సమస్యలుంటే తీర్చేందుకు ప్రయత్నం చేయడం వాళ్ల పని.

ఇలా పార్టీ ఆర్మీని తయారుచేసుకున్నందునే రాహుల్ ‘ప్రాజక్టు శక్తి’ కి 13 వేల మందిని నమోదు చేయించడం సుళువయిందని శ్రీకాంత్ చెబుతాడు.