యశ్‌ హీరోగా ‘టాక్సిక్‌’

యశ్‌ హీరోగా ‘టాక్సిక్‌’ చిత్రాన్ని ప్రకటించి చాలా రోజులవుతోంది. దీనికి సంబంధించి అప్‌డేట్స్‌ రాకపోయినా.. తరచూ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఇటీవల ఇందులోని హీరోయిన్ల గురించి పలు వార్తలు సోషల్‌ విూడియాలో వైరల్‌ కాగా.. తాజాగా దీని షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట షేర్‌ అవుతోంది. ఇటీవలే దీని షూటింగ్‌ ప్రారంభించారని.. ప్రస్తుతం కర్ణాటకలో శరవేగంగా జరుగుతోన్నట్లు సమాచారం.

ఈ సినిమాను కూడా ‘కేజీఎఫ్‌’ లాగా రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కూడా ప్రధానమైనది కావడంతో అగ్ర నటీమణులను తీసుకోవాలని చిత్రబృందం బావిస్తోంది.

ఇప్పటికే ఇందులో నటించనున్నట్లు ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, కియారా అడ్వాణీ, శ్రుతి హాసన్‌లను పరిశీలిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.’కేజీఎఫ్‌’ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత యశ్‌ నటిస్తోన్న చిత్రమే ‘టాక్సిక్‌’. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉపశీర్షిక. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బ్జడెట్‌తో కె.వి.ఎన్‌. ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ ప్రియులను అలరించే కథాంశంతో ఇది సిద్ధమవుతోన్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.