ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ బజాజ్ మోటర్ సైకిల్ కంపెనీ త్వరలోనే కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పబోతోంది. కంపెనీ గతంలో మార్కెట్‌లోకి లాంచ్ చేసిన పల్సర్ లోనే మరో సారి కొత్త మోడల్‌లో అందుబాటులోకి రాబోతోంది. అయితే కంపెనీ దీనిని CNG వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే కొత్త పల్సర్ NS400Z లాంచ్ సందర్భంగా బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ సమాచారాన్ని వెల్లడించారు. త్వరలోనే లాంచ్ కాబోయే CNG బైక్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్ స్పెషిఫికేషన్స్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే బజాజ్ CNG బైక్ యొక్క ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇప్పటికే కంపెనీ ఈ బజాజ్ CNG బైక్‌ను టెస్టింగ్ కూడా చేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్ కి సంబంధించిన ఫోటోస్ తాజాగా లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన ఫోటోస్ ని చూస్తే, ఇది పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ సెటప్ ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బైక్ ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది 100, 125 సీసీ తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బజాజ్ CNG బైక్ టెస్ట్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌తో అందుబాటులోకి రాబోతోంది.
దీంతో పాటు మోనోషాక్, డిస్క్, డ్రమ్ బ్రేక్ సెటప్‌తో అందుబాటులోకి వస్తోంది. అంతే కాకుండా ప్రత్యేకమైన భద్రతా నిబంధనలతో మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బైక్‌లో సింగిల్-ఛానల్ ABS, కాంబిబ్రేకింగ్ ఫీచర్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. బజాజ్ కంపెనీ ఈ CNG బైక్‌కి సంబంధించిన పేరు, ఇతర సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అలాగే బజాజ్ ఇటీవలే బ్రూజర్ అనే పేరును కూడా ప్రస్తావించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇదే పేరు దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లో లాంచ్ అయితే మొదటి బజాజ్ సిఎన్‌జి బైక్‌గా నిలుస్తుందని చెప్పాలి.