ఉస్మానియా యూనివర్సిటి విద్యార్ది, తెలంగాణ విద్యార్ధి సంఘం (టివిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కోట శ్రీనివాస్ గౌడ్ కిడ్నాప్ కు గురయ్యారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పెద్దపల్లిలో కిడ్నాప్ అయ్యాడు. శ్రీనివాస్ గౌడ్ సొంత ఊరు పెద్దపల్లి. పెద్దపల్లిలో శ్రీనివాస్ ఉండగా కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారని సమాచారం అందుతోంది.
అప్పటి నుంచి శ్రీనివాస్ ఆచూకీ లభించడం లేదు. శ్రీనివాస్ ను బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆపే ప్రయత్నం చేసినా వారు వినలేదని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటి లో చదువుతున్న శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. శ్రీనివాస్ ఆచూకీ కోసం పెద్దపల్లితో పాటు ఓయూలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇది కావాలని చేసిన కిడ్నాపేనని తెలంగాణ పోలీసులే శ్రీనివాస్ ను కిడ్నాప్ చేశారని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ కు ఏమి జరిగినా రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని విద్యార్ధి సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే శ్రీనివాస్ ను విడిచి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శ్రీనివాస్ కిడ్నాప్ తో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.