హరీష్ రావు వీరాభిమాని ఏం చేసిండో తెలుసా (వీడియోలు)

ఈ యువకుడు తెలంగాణ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు వీరాభిమాని. హరీష్ రావును ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో పనిచేయాలన్న ఆసక్తి ఉంది ఈ యువకుడికి. నిత్యం గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలన్న తపన ఉన్నవాడు. గ్రామంలో ఈ యువకుడు చేసిన పని చూస్తే అందరూ ఫిదా కావాల్సిందే. ఇంతకూ ఎవరు ఈ హరీష్ రావు ఫ్యాన్. అసలు ముచ్చటేంది? చదవండి.

ఈ యువకుడి పేరు గుగులోతు సుధాకర్ నాయక్. స్వగ్రామం ఎర్రకుంట తండా. మండలం, జిల్లా జనగామ. ఈయన టిఆర్ఎస్ పార్టీకి మండల ఎస్టీ సెల్ ప్రసిడెంట్ గా పనిచేస్తున్నాడు. పెళ్లి కాలేదు. ఎస్టీ సెల్ ప్రసిడెంట్ గా ఉన్న సుధాకర్ నాయక్ నిత్యం గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా క్షణాల్లో వారి పనిచేసి పెడతాడు. అయితే ఏ పని చేసినా ఇంతో అంతో కమిషన్ తీసుకునే రాజకీయ నాయకులు ఉన్న ఈరోజుల్లో ఈ సుధాకర్ మాత్రం నయా పైసా తీసుకోడు. పైగా మంత్రి హరీష్ రావుకు వీరాభిమాని. దీంతో ఎర్రకుంట తండా గ్రామంలో సుధాకర్ అందరికీ సుపరిచితుడు అయ్యాడు.

సుధాకర్ నాయక్

గ్రామంలో ఉన్న మోరీలను నెలల తరబడి సాఫ్ చేయకపోవడం సుధాకర్ కు ఇబ్బందికరంగా అనిపించింది. మోరీలు సాఫ్ చేయాలని గ్రామ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పని మాత్రం కాలేదు. దీంతో ఇక చేసేది లేక సుధాకర్ మోరీల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించే పనికి పూనుకున్నాడు. 530 ఓటర్లున్న ఎర్రకుంట తండా గ్రామంలో మోరీలన్నీ క్లీన్ చేసి చెత్త అంతా బయట వేశాడు. అంతేకాదు ఆ చెత్తను ఊరి బయటకు తరలించి స్వచ్చ భారత్ కార్యక్రమం చేపట్టాడు. 

సుధాకర్ చేసిన ఈ పనికి గ్రామస్థులంతా అభినందనలు తెలుపుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, అందుకే తానే మోరీలోకి దిగి సాఫ్ చేసినట్లు సుధాకర్ నాయక్ ‘‘తెలుగురాజ్యం’’ కు చెప్పారు. ఇంకా అనేక విషయాలు సుధాకర్ మాట్లాడారు. సర్పంచ్ గా పోటీ చేసే ఆలోచన ఉందని, కానీ టిఆర్ఎస్ లోనే 12 మంది పోటీకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పాడు. జనరల్ సీటు కావడంతో అంతమంది పోటీలో ఉంటే తనకు అవకాశం వస్తదో రాదో అని మీమాంసలో ఉన్నారు సుధాకర్. కానీ తనకు పోటీ చేసే అవకాశం రాకపోయినా పనిచేసే వారినే గుర్తించి గెలిపించుకోవాలని గ్రామస్తులను కోరుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో గ్రామంలో ప్రజలకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. 

సుధాకర్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. ఐటిఐ ఎటక్ర్టీషియన్ చదివాడు. రెండేళ్ల పాటు హైదరాబాద్ లోని టూల్ ఇంజనీరింగ్ కంపెనీలో సర్వీస్ అండ్ సేల్స్ ఇంజనీర్ గా పనిచేశాడు. అయితే రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో గ్రామంలో సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. హరీష్ రావు వీరాభిమాని కదా? హరీష్ రావును కలిశారా అంటే ఇప్పట ివరకు కలవలేదని చెప్పిన సుధాకర్ నాయక్ త్వరలోనే హరీష్ రావును కలుస్తానని చెప్పాడు. 

సుధాకర్ చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ వీడియోలు కింద ఉన్నాయి చూడొచ్చు.