కొండను ఢీకొడతానంటున్న బండి.. కళ్ళు తిరిగి పడిపోరు కదా !

Bandi Sanjay eants to defeat Harish Rao in Siddipet

భారతీయ జనతా పార్టీలు దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అంతగా వెలిగిపోతున్న రాష్ట్రం తెలంగాణ.  ఉద్యమం నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన కేసీఆర్ ను కిందకు లాగడం అంత ఈజీగా అయ్యే పని కాదని, ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని  అంతా అనుకున్నారు.  కానీ భారతీయ జనతా పార్టీ ఏడేళ్లు గడవకముందే కేసీఆర్ ను కిందికి దించడం మొదలుపెట్టింది.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే అధిక సీట్లు పొందిన తెరాస పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ రూపంలో దెబ్బలు తింది.  ఆ దెబ్బల పర్వం అలా కొనసాగి దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలోనూ కనబడింది.  చాపకింద నీరులా ఊహించని రీతిలో పుంజుకున్న బీజేపీని చూసి కేసీఆర్ సైతం షాకయ్యారు.  పంథాను మార్చుకున్నారు.  

Bandi Sanjay eants to defeat Harish Rao in Siddipet
Bandi Sanjay eants to defeat Harish Rao in Siddipet

ఇది బీజేపీకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.  అందుకే మరింతగా విస్తరించాలని  చూస్తోంది.  ముందుగా సిద్ధిపేట మీద కన్నువేసింది.  సిద్దిపేట తెరాసకు పెట్టని కోట.  అక్కడ గులాబీ జెండా తప్ప ఇంకొకరి కనిపించదు.  అది హరీష్ రావు ఫాలోయింగ్.  కేసీఆర్ తర్వాత పార్టీలో అంతటి ఆదరణ ఉన్న వ్యక్తిగా ప్రజల్లో ఆయనకు పేరుంది.  అలాంటి ఆయన్ను ఓడించాలని బీజేపీ ప్లాన్ చేసుకుందట.  ప్రజల్లో ఎక్కడైనా అసంతృప్తి ఉందేమో వెతుకుతున్నారట.  నిజానికి సిద్ధిపేట ఈ ఈరోజు తెలంగాణలోని చాలా జిల్లాలను మించి అభివృద్ధి చెందగలిగింది అంటే అది హరీష్ రావు పనితనమే.  అందుకే అక్కడి జనానికి హరీష్ రావు అంటే మరొక కేసీఆర్ అన్నట్టే.  సిద్దిపేటను ప్రగతిపథంలో నడిపించిన ఆయనకు జనాలు నీరాజనాలు పడుతుంటారు.  

ఒక్కోసారి హరీష్ రావు ఎన్నికల ప్రచారానికి జనమే డబ్బును పోగేస్తుంటారు.  అలాంటి పెట్టని కోట అయిన సిద్దిపేటను హరీష్ రావు నుండి దూరం చేయాలని చూస్తున్నారట.  అయితే అది అనుకున్నంతా సులువేం  కాదు.  పోటీచేసిన ప్రతిసారి గెలవడమే కాదు మెజారిటీని పెంచుకుంటున్నారు కూడ.  అలాంటి నాయకుడిని ఓడించడమంటే అవతల మరొక కేసీఆర్ అయినా ఉండాలి లేకపోతే ఇంకొక హరీష్ రావు అయినా ఉండాలి.  అలాంటి ఆయన్ను  ఓడించాలని బీజేపీ భావిస్తోంది.  ఎంత రెండు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే మాత్రం సిద్దిపేటలో హరీష్ రావును ఢీకొట్టే సాహసం అంత మంచిది కాదు,  అది ఒకరకంగా చెప్పాలంటే కొండను ఢీకోట్టినట్టే.  కొట్టించుకునేవాడికి మొదట్లో అయితే ఏం కాదు కానీ ఒక్కోసారి తలే పగిలిపోతుంది.  

ఇప్పుడు బీజేపీ ఈ పనే చేస్తోంది.  సిద్ధిపేటలో రాబోయే ఎన్నికల్లో హరీష్ రావును అధిగమించాలని చూస్తోంది.  హరీష్ రావు వరుసగా 6 ఎన్నికల్లో గెలుపొందారు. ఆయనలాంటి లీడరును సిద్ధిపేట జనం అంత ఈజీగా వదులుకోలేరు.  అందుకోసం బీజేపీ పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది.  ఒకవేళ ఆ యుద్ధంలో వ్యూహలు తలకిందులైతే బీజేపీకి బొప్పి గట్టిగా తగిలి కళ్ళు తిరిగిపడిపోవడం ఖాయం.