తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పోటీదారుడు లేరని మొన్నటి వరకు చాలామంది అనుకున్నారు . అయితే కొన్ని అనూహ్యమైన సంఘటనల వల్ల ఇప్పుడు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు నూకలు చెల్లనున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. టీఆర్ఎస్ నేతల గుండెల్లో ఈ భయం కలగడానికి కారణం బీజేపీ. బీజేపీ నేతలు ఇప్పుడు కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. వరుస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది .దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు త్వరలో పార్టీని బలపరచడానికి రంగంలో దిగనున్నారని సమాచారం.
పార్టీని బతికించడానికి కేసీఆర్ రావల్సిందేనా!!
ఈ మధ్య ఏ ఎన్నికలు జరిగినా కూడా కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగటం లేదు. హరీష్ రావ్ కో, కేటీఆర్ కో బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే వాళ్ళు ముందుండి నడిపించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చూసింది. దింతో ఇప్పుడు పార్టీని బలపరచడానికి కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని సమాచారం. ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అంటే… ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో ఎక్కువ స్థానాలు సాధించింది కాబట్టి. కానీ ఈ జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. దింతో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.
బీజేపీ కేసిఆర్ అడ్డుకోగలడా!!
బీజేపీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన జెండాను పాతడానికి చాలా ప్రయత్నిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే వాళ్ళు ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా ప్రజలు ఆదరిస్తున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ నాయకులు యొక్క దూకుడు పెరిగింది. అలాగే బీజేపీ చేసే మత పరమైన రాజకీయాల వల్ల రాష్ట్రంలో బీజేపీ ముందుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగు అవ్వడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉనం ఏకైనా ఆప్షన్ గా బీజేపీ కనిపిస్తుంది. అయితే బీజేపీ యొక్క దూకుడును టీఆర్ఎస్ నేతలు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి