టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పచ్చి రెడ్డి వ్యతిరేకి.. అందుకే తెలంగాణలో రెడ్లను అణగదొక్కుతున్నడు.. రెడ్లు రాజకీయం చేయడం కేసిఆర్ కు సుతారం ఇష్టం లేదు.. టిఆర్ఎస్ అంటే తెలంగాణ రావుల సమితి.. యాంటీ రెడ్డీస్ పార్టీ.. రెడ్లు అంతా ఏకం కావాలి.. టిఆర్ఎస్ ను ఓడించాలి.. ఈ మాటలు ఇటీవల కాలంలో తరచుగా రాజకీయ పార్టీ నేతల నోటి నుంచి వస్తున్నాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అంతర్గత సంబాషణల్లో ఈ డైలాగులను వాడుతున్నారు. ఓపెన్ గా చెప్పకపోయినా కులసంఘం సమావేశాల్లో, లేదంటే ఒక పార్టీకి చెందిన రెడ్డి నేతలు ఇంకో పార్టీ రెడ్డి నేతలతో కలుసుకున్న సందర్భంలో ఈ కామెంట్స్ పేలుతున్నాయి. కొంత మంది రెడ్డి నేతలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. వారిలో సంగారెడ్డి జగ్గారెడ్డి ఒకరు. ఆయన మీడియా ముందే తాను రెడ్డి పుట్క పుట్టానని, రెడ్లు రాజకీయం చేయెద్దా కేసిఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనాది కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనగానే రెడ్ల పార్టీ అన్న ముద్ర బలంగా ఉంది. టిడిపి అంటే కమ్మ, బిసిల పార్టీగా తెలంగాణలో ఒక ప్రచారమైతే ఉంది. ఇక టిఆర్ఎస్ పార్టీ అంటే వెలమల పార్టీ అని కూడా టాక్ ఉంది. వామపక్షాల్లో సిపిఎం కమ్మ పార్టీగా, సిపిఐ కమ్మ రెడ్డి పార్టీగా జనాల్లో ఎస్టాబ్లిష్ మెంట్ ఉంది. తెలంగాణ జన సమితి రెడ్ల పార్టీగా ముద్రలు వేయబడ్డాయి. ఉన్నంతలో బిజెపికి పెద్దగా కులముద్ర పడలేదు. ఆ పార్టీ మతానికి పెద్దపీట వేస్తున్న పార్టీగా ఉన్నప్పటికీ హిందూవుల మద్దతును సైతం కూడగట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నది. ఇక ఎంఐఎం అంటే ముస్లింల పార్టీగా నిలిచింది.
పైకి కులాలు లేవు, ఏం లేవు అన్న చర్చ ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల్లో ఏదో ఒక కులం వారే లీడ్ చేస్తున్న వాతావరణం ఉంది. టిఆర్ఎస్ విషయానికి వస్తే టిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పగానే ఇది వెలమల పార్టీ అని ముని పెదవులతో అనేస్తారు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. టిఆర్ఎస్ నాయకత్వం స్థానంలో కేసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు వరకు వెలమలే ఉన్నప్పటికీ ఆ పార్టీలో సింహభాగం పోస్టులన్నీ రెడ్లకే కట్టబెట్టారు కేసిఆర్. కేసిఆర్ కోటరీలో మెజార్టీ స్థానాల్లో రెడ్లే ఉన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కారణాలేమైనా ఇప్పటివరకు కేసిఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది రెండే కులాలకు అందులో ఒకటి రెడ్డి, రెండోది బ్రాహ్మణ కులం. ఇందులో ఈ రెండు కులాలకే తెలంగాణ స్వరాష్ట్రంలో గౌరవం దక్కిందన్న చర్చ బడుగు, బలహీన వర్గాల నుంచి వినబడుతున్నది. రెడ్లకు భయంతో, బ్రాహ్మణులకు భక్తితో కేసిఆర్ ఈ రెండు కులాలకు బాగా వెసులుబాట్లు, అవకాశాలు ఇచ్చారన్న చర్చ ఉంది.
ఇక జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నారని చెప్పుకుంటున్న బిసిలకు దక్కింది అంతంత మాత్రమే. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో తన కుటుంబసభ్యుడైన సంతోష్ రావుకు ఒక సీటు ఇవ్వగా మరో రెండు సీట్లను మాత్రం యాదవ కు ఒకటి, ముదిరాజ్ కు ఒకటి కట్టబెట్టారు. దళిత, గిరిజనులకు కూడా అత్తెసరు అవకాశాలే దక్కాయన్న విమర్శ ఉంది.
మొన్న జగ్గారెడ్డి మీద 14 ఏండ్ల క్రిందటి కేసును తిరగదోడి అరెస్టు చేసిన నేపథ్యంలో కుల చర్చ తెలంగాణ సమాజంలో జోరందుకున్నది. తర్వాత వెనువెంటనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ పదవి దక్కగానే ఆయన మీద ఐటి రైడ్స్ జరగడం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది. రెడ్లను అణగదొక్కుతున్నారన్న విమర్శలు వినిపంచాయి.
ఈ నేపథ్యంలోనే అసలు కేసిఆర్ కోటరీలో ఎందరు రెడ్లు ఉన్నారో చూడండి అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉన్నది. ఆ జాబితా చూస్తే మాత్రం కేసిఆర్ రెడ్డి వ్యతిరేకి కాదేమో అన్న అనుమానమైతే కలుగుతుంది. వెలమ, రెడ్డి, బ్రాహ్మణ వర్గాలకు తెలంగాణలో అన్యాయం జరగలేదేమో అని భావించే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న కేసిఆర్ కోటరీలోని రెడ్డి ప్రముఖుల జాబితా కింద ఉంది చూడండి. ఈ జాబితా చూస్తే కాంగ్రెస్ పరిపాలనలో కూడా ఇంత మంది రెడ్డిలు ఉన్నత స్థానాల్లో లేరేమో అంటున్నారు. టిఆర్ఎస్ అంటే తెలంగాణ రావుల సమితి కాదు రెడ్ల సమితి అన్నంతగా ఉంది జాబితా.
కేసిఆర్ కేబినెట్ లో మంత్రులు
1. జి జగదీష్ రెడ్డి (విద్యుత్ శాఖ)
2. నాయిని నరసింహా రెడ్డి (హోం శాఖ)
3. పోచారం శ్రీనివాస్ రెడ్డి (వ్యవసాయం)
4. పి. మహేందర్ రెడ్డి (రవాణా)
5. సి. లక్ష్మా రెడ్డి (వైద్యం)
6. అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి – (దేవాదాయ, హౌసింగ్)
ఎమ్మెల్యేలు
1. పద్మా దేవేందర్ రెడ్డి – డిప్యూటీ స్పీకర్
2. దాసరి మనోహర్ రెడ్డి – పెద్దపల్లి
3. ఆశన్నగారి జీవన్ రెడ్డి – ఆర్మూర్
4. ఏనుగు రవీందర్ రెడ్డి – ఎల్లారెడ్డి
5. వేముల ప్రశాంత్ రెడ్డి – బాల్కొండ ( మిషన్ భగీరథ వైస్ చైర్మన్)
6. ఎం. భూపాల్ రెడ్డి – నారాయణఖేడ్
7. చిలుముల మదన్ రెడ్డి – నర్సాపూర్
8. గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్‌చెరు
9. సోలిపేట రామలింగా రెడ్డి – దుబ్బాక
10. మలిపెద్ది సుదీర్ రెడ్డి – మేడ్చల్
11. చింతల కనకా రెడ్డి – మల్కాజ్ గిరి
12. ఆల వెంకటేశ్వర్ రెడ్డి – దేవరకద్ర
13. మర్రి జనార్ధన్ రెడ్డి – నాగర్ కర్నూల్
14. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – మునుగోడు
15. ఫైళ్ల శేకర్ రెడ్డి – భువనగిరి
16. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి – జనగాం
17. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి – ఆలేరు
18. గడ్డిగారి విటల్ రెడ్డి – ముధోల్
19. మంచిరెడ్డి కిషన్ రెడ్డి – ఇబ్రహింపట్నం
20. తీగల క్రిష్ణారెడ్డి – మహేశ్వరం
21. ఎస్ రాజేందర్ రెడ్డి – నారాయణ్ పేట్
22. చిట్టెం రామ్మోహన్ రెడ్డి – మక్తల్
23. చల్లా ధర్మారెడ్డి – పరకాల
ఎంపీలు
1. కొండా విశ్వేశ్వర్ రెడ్డి – చేవెళ్ల
2. ఎపి జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్
3. కొత్త ప్రభాకర్ రెడ్డి – మెదక్
4. మల్లారెడ్డి – మల్కాజ్ గిరి
5. పొంగులేటి శ్రీనివాస రెడ్డి – ఖమ్మం
6. గుత్తా సుఖేందర్ రెడ్డి – రైతు సమన్వయ సమితి రాష్త్ర అధ్యక్షులు
ఎమ్మెల్సీలు
1. భూపతి రెడ్డి – స్థానిక సంస్థలు ( నిజామాబాద్ )
2. పట్నం నరేందర్ రెడ్డి – స్థానిక సంస్థలు (రంగారెడ్డి)
3. కసిరెడ్డి నారాయణ్ రెడ్డి – స్థానిక సంస్థలు (మహబూబ్ నగర్ )
4. కాటేపల్లి జనార్ధన్ రెడ్డి – ఉపాధ్యాయ (హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్)
5. కొంపల్లి యాదవ రెడ్డి – అసెంబ్లీ కోటాలో
6. పాతూరి సుధాకర్ రెడ్డి -ఉపాధ్యాయ (ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ )
7. మదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి – గవర్నర్ నామినేటెడ్
8. పల్లా రాజేశ్వర్ రెడ్డి – పట్టభద్రుల (నల్గొండ-వరంగల్-ఖమ్మం )
9. వి భూపాల్ రెడ్డి – స్థానిక సంస్థలు (మెదక్)
10. కూచుకుల్ల దామోదర్ రెడ్డి – స్థానిక సంస్థలు (మహబూబ్ నగర్)
11. ఎలిమినేటి కృష్ణారెడ్డి – అసెంబ్లీ
ప్రభుత్వంలోని ముఖ్య పదవుల్లో
1. నిరంజన్ రెడ్డి – ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్
2. శేరీ శుభాష్ రెడ్డి – టిఎస్ఎండిసి చైర్మన్
3. పెద్ది సుదర్శన్ రెడ్డి – సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్
4. ఈద శంకర్ రెడ్డి – ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
5. మర్రి యాదవ్ రెడ్డి – కుడా చైర్మన్
6. వెంకటేశ్వర్ రెడ్డి – తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
7. బండ నరేందర్ రెడ్డి – తెలంగాణ అటవీ కార్పోరేషన్ చైర్మన్
8. ప్రొఫెసర్ పాపి రెడ్డి – ఉన్నత విద్యామండలి చైర్మన్
9. లోక భూమా రెడ్డి – తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్
10. కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి – తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్
11. పెంటా రెడ్డి – ఎత్తిపోతల పధకం సలహాదారులు
12. కొణతం దిలీప్ రెడ్డి – డైరెక్టర్ డిజిటల్ మీడియా
13. శైలేష్ రెడ్డి – సిఈఓ (సాఫ్ట్ నెట్ – మన టివి )
14. వి.ఎన్. భరత్ రెడ్డి – డైరెక్టర్ ఏవియేషన్
15. సామ వెంకన్న(వెంకట్ రెడ్డి) రాష్ట్ర సమాన వేతనాల బోర్డు చైర్మన్
16. లోక బాపు రెడ్డి – తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్
17. భూపతి రెడ్డి – టూరిజం కార్పొరేషన్ చైర్మన్
ముఖ్యమంత్రి కార్యాలయం
1. పి రాజశేఖర్ రెడ్డి (ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ)
2. కె. భూపాల్ రెడ్డి (ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ)
ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది
1. శ్రవణ్ రెడ్డి – ముఖ్యమంత్రి పబ్లిసిటీ సెక్రటరీ
2. పరమేశ్వర్ రెడ్డి – ముఖ్యమంత్రి పి.ఎ.
2. అజిత్ రెడ్డి – ముఖ్యమంత్రి పి.ఏ (ప్రస్తుతం ఈయనను అవినీతి ఆరోపణల వల్ల పక్కన పెట్టారు. జీతం ఇస్తున్నట్లు సమాచారం)
రాష్ట్ర ఎన్నికల సంఘం
1. నాగిరెడ్డి, కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్
తెలంగాణ మీడియా సంస్థలు
1. కట్టా శేఖర్ రెడ్డి – ఎడిటర్ – నమస్తే తెలంగాణ
2. కె. శ్రీనివాస్ రెడ్డి – ఎడిటర్ – తెలంగాణ టుడే
3. ఎం. నారాయణ రెడ్డి – సి.ఈ.ఓ. టి-న్యూస్
నోట్ : పైన ఉన్న 72 మందిలో అందరికీ కేసిఆర్ అవకాశం ఇవ్వకపోవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపిలు ఇతర పార్టీల్లో గెలిచి టిఆర్ఎస్ లో చేరొచ్చు. అయినా టిఆర్ఎస్ లో తాము సేఫ్ గా ఉంటామన్న భావనతోనే వారు వచ్చారని భావించవచ్చు.