వైఎస్సార్ కూడ నావల్ల కాదు అని చేతులెత్తేసింది జగన్ వల్ల అయ్యింది 

welfare schemes
కడపలో ఉక్కు కర్మాగారం నిర్మించాలనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి కల.  ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి కల్పించాలానేది వైఎస్సార్ ఉద్దేశ్యం.  ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలనే కష్టపడ్డారు.  గాలి జనార్థన్ రెడ్డి లాంటి వారితో సంప్రదింపులు కూడా జరిపారు.  కానీ ఆ కల నెరవేరకుండానే ఆయన వెళ్ళిపోయారు.  దీంతో రాయలసీమ వాసుల కల కలగానే మిగిలిపోయింది.  ఈ కలను నెరవేర్చే బాద్యతను వైఎస్ జగన్ భుజాన వేసుకున్నారు.  తమ ప్రభుత్వం ఏర్పడితే కేంద్రంతో మాట్లాడి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు.  ఆ హామీ మేరకే అధికారంలోకి రాగానే జమ్మలమడుగు జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275 ఎకరాల భూమిని కేటాయించి ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు.  
Project
 
10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నారు.  ఇక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి టెండర్లను పిలిచారు.  రెండు విదేశీ కంపెనీలతో పాటు ఐదు స్వదేశీ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి.  భాగస్వామ్య కంపెనీలు 6 వేల కోట్ల నుండి 30 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే వీలుంది.  సంవత్సరానికి 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి ఈ కర్మాగారం లక్ష్యం.  మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలి అనేది జగన్ ఉద్దేశ్యం.  
 
వైఎస్సార్ ప్రత్యేక ఆసక్తితో పనిచేసిన ఈ ప్రాజెక్ట్ మీద గత టీడీపీ ప్రభుత్వం అలసత్వం చూపింది.  కేంద్రం ఒప్పుకోదని, సొంత ఖర్చులతో చేయడానికి నిధులు లేవని రకరకాల సాకులు చెబుతూ టైమ్ పాస్ చేసింది.  సీమ ప్రజలకు ఇక టీడీపీతో ఉక్కు పరిశ్రమ అసాధ్యమని తేలిపోయింది.  అందుకే వైసీపీకి పటం కట్టారు.  ఎన్నికల హమీల్లో చెప్పినట్టే జగన్ అధికారంలోకి రాగానే శంఖుస్థాపన చేశారు.  ఇంకో మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది.  సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.