ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా విధ్వంసకాండ 

IIM Report on Andhra Pradesh Media
ఆంధ్రప్రదేశ్ లో మీడియా విధ్వంసక పాత్ర పోషిస్తున్నదని ఐఐటీ అహమ్మదాబాద్ వారు నిర్వహించిన ఒక పరిశోధనలో తేలిందని కొన్ని జాతీయ  పత్రికల్లో వచ్చిన వార్తలు నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. ఈ విషయం నాబోటివారు ఎప్పటినుంచో చెబుతున్నారు.  మన మీడియా స్వతంత్ర మీడియా కాదు. అది కేవలం పచ్చ మీడియా.కరెన్సీ నోట్లకు అమ్ముడుపోయే బానిస మీడియా.దానికి నీతిజాతి లేవు. చంద్రబాబు దోచుకునే అవినీతిసొమ్ములో వాటాలు పంచుకోవడం, చంద్రబాబుకు భజనలు చేస్తూ ఆయన్ను అధికారంలో ఉంచడానికి సర్వశక్తులు ఒడ్డటం, ఆయనకు అధికారం లేనపుడు ఆయన ప్రత్యర్థులపై విషపురాతలు రాయడం,  ఈ క్షుద్ర మీడియాకు గత పాతికేళ్లుగా అలవాటుగా మారింది. ఈ పచ్చమీడియాకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది.  రాజుగారి దేవతవస్త్రాల వంటి ఆ అభివృద్ధి సామాన్యుల కళ్ళకు కనిపించదు.  కేవలం పచ్చకామెర్ల మీడియాకు మాత్రమే పంచరంగుల్లో కనిపిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ లో  మీడియా విధ్వంసకాండ  

 
IIM Report on Andhra Pradesh Media
 
ఎప్పుడైతే రాజధానిని వికేంద్రీకరిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారో, ఆ క్షణం నుంచే పచ్చమీడియా వేయితలల విషనాగులా బుసలు కొట్టడం మొదలుపెట్టింది.  ఎందుకంటే చంద్రబాబు, ఆయన తైనాతీలు, ఆయన సామాజికవర్గం వారైన కొందరు ఎన్నారైలు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అక్కడ వందల ఎకరాల భూములను కారుచౌకగా ఆక్రమించేశారు.  చంద్రబాబు ధనదాహానికి  ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పొలాలు విధ్వంసానికి గురయ్యాయి.    అమరావతి ప్రాంతంలో ఒక్క పరిశ్రమ లేకపోయినా, ఒక్క ప్రతిష్టాత్మక విద్యాసంస్థ లేకపోయినా వేలకోట్ల పెట్టుబడులు కుమ్మరించి ఆకాశహర్మ్యాలు నిర్మించేసి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు.   ఇంకా అమ్మాల్సినవి వేలల్లో ఉన్నాయి.   అలాగే ఎకరం యాభై కోట్లు పలుకుతుందని దురాశతో వెంచర్లు వేశారు.  ఇప్పుడు ఆ దురాశలు అగ్నికి ఆహుతైన మిడతల్లా నాశనమైపోయాయి.  దాంతో డ్రామా ఆర్టిస్టులను కూర్చోబెట్టి రైతుల పేరుతొ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చెయ్యాలని కుట్రలు పన్నుతున్నారు.  వీరికి పచ్చమీడియా తమ స్వార్ధం కోసం వాంతులు చేసుకుంటున్నది.  
 
అభివృద్ధి అంతా కేంద్రీకృతం అయితే ఏమి జరుగుతుందో గతంలో మనకు అనేక దృష్టాంతాలు  ఉన్నాయి.  ఆంధ్రరాష్ట్రం మద్రాసు రాష్ట్రంలో ఉన్నపుడు కోస్తా జిల్లాలనుంచి వందలమంది వ్యాపారులు మద్రాస్ వెళ్లి అక్కడ వ్యాపారాలు ప్రారంభించారు.  అక్కడే ఆస్తులు కొన్నారు.  అక్కడే స్థిరపడ్డారు.   తమిళ భాషను తమిళులకన్నా  మిన్నగా నేర్చుకుని వారితో కలిసిపోయారు.  1930  నుంచి  సినిమాపరిశ్రమ మొత్తం మద్రాస్ లోనే స్థిరపడింది. నాటి కళాకారులు అందరూ మద్రాస్ లోనే స్టూడియోలు కట్టారు.  అక్కడే గృహాలను నిర్మించుకున్నారు.    తమిళనాడు  అభివృద్ధిలో ఆంధ్రులు గణనీయమైన పాత్రను పోషించారు.  అయితే స్వతంత్రం వచ్చాక జరిగిన అనేక పరిణామాల్లో మద్రాస్ నుంచి ఆంధ్రావారిని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు రాజగోపాలాచారి.  దాంతో బిక్కుబిక్కుమంటూ కర్నూల్ చేరి అక్కడ తాత్కాలిక గుడారాలు వేసుకున్నారు.  ఆ తరువాత మూడేళ్లకు తెలంగాణ ను కలుపుకుని విశాలాంధ్ర ఏర్పాటు చేశారు.  నిజానికి ఆనాడే తెలంగాణ వారు ఈ కలయికను వ్యతిరేకించినప్పటికీ, బలవంతంగా ఒప్పించి రెండు ప్రాంతాలను కలిపేశారు.   నిజానికి ఆనాడే ఆంధ్రాలోనే కృష్ణాజిల్లా నో, విశాఖనో రాజధానిగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటె ఇవాళ హైద్రాబాద్ లో కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం విజయవాడ లోనో, విశాఖ లోనో కనిపించేది.  తెలంగాణ కూడా సమాంతరంగా అభివృద్ధి చెంది రెండు తెలుగు రాష్ట్రాలుగా జాతీయస్థాయిలో  రెపరెపలాడుతుండేవి.  
 
ఇక విశాలాంధ్ర ఏర్పడ్డాక వచ్చిన ప్రభుత్వాలు అన్నీ హైద్రాబాద్ ను అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా పనిచేసాయి.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయపార్టీలకు చెందిన నాయకులకు హైద్రాబాద్ లో ఇళ్ళు, ఆస్తులు ఉన్నాయి.  వారు పరిశ్రమలు కూడా హైద్రాబాద్, దాని చుట్టుపక్కల స్థాపించారు.  ఆంధ్రవారికి చెందిన మీడియా హౌస్లు, ఫిలిం స్టూడియోలు అన్నీ హైద్రాబాద్ , దాని పరిసర ప్రాంతాల్లోనే వెలిశాయి.  ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అక్కడి నిరుద్యోగులు అందరూ పొట్టకూటికోసం హైద్రాబాద్ వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చారు.  

అమరావతే ఎందుకు?

విశాలాంధ్ర ఏర్పడేముందే జవహర్లాల్ నెహ్రు ఆనాడే ఊహించినట్లు  ఇష్టంలేని పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకోవడంతో ఆంధ్రులు మళ్ళీ రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.  నిజానికి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప లాంటి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి.   విజయనగరం, శ్రీకాకుళం,  కాకినాడ, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, చిత్తూర్  లాంటి పట్టణాలు ఉన్నాయి.  ,ఏదో ఒక నగరాన్ని రాజధానిగా ప్రకటించవచ్చు. కానీ, చంద్రబాబు దురుద్దేశ్యాలు వేరు.  గత అనుభవాలను  దృష్టిలో పెట్టుకుని గుణపాఠాలు నేర్చుకోలేదు.  ఆయనకు కావాల్సింది వేలకోట్ల రూపాయల డబ్బు. తన కులం వాళ్ళు ఇతర కులస్తులపై అధికారం చెలాయించడం. హైటెక్ సిటీ కట్టేముందు తన కులంవారికి ముందుగానే తెలియజేసి మాదాపూర్ లో ఎకరాలకొద్దీ ఖాళీ స్థలాలను కొనిపించి వందల కోట్ల రూపాయలు లబ్ది కలిగించాడు.  తాను స్వయంగా ఎకరం లక్ష రూపాయలకు కొని ముప్ఫయి కోట్లకు అమ్ముకున్నట్లు ఆయనే ఒకసారి నోరుజారాడు.  అలాగే అమరావతి రాజధాని రహస్యం కూడా ముందుగానే తన కులంవారికి లీక్ చేసి పదులకొద్దీ ఎకరాలను కారుచౌకగా కొనిపించాడు. తమ కుటుంబ కంపెనీ  హెరిటేజ్ కోసం పదునాలుగు ఎకరాలను కొనేశారు.    మిగిలిన పన్నెండు జిల్లాలవారి కష్టార్జితాన్ని కేవలం తన కులస్తులున్న అమరావతిలో ధారపోసి అన్ని జిల్లాలవారు తమ బతుకుతెరువు కోసం అమరావతి చేరి తన కులస్తుల చెప్పుల కింద తేళ్ళలా పడిఉండేట్లు కుయుక్తులు పన్నాడు.    
 
జగన్ మాత్రం గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని సంపద మొత్తం ఒకేచోట కేంద్రీకరిస్తే మద్రాస్, హైద్రాబాద్ లలో ఆంధ్రులకు ఎదురయ్యే అనుభవాలే మళ్ళీ ఏదో ఒకనాటికి ఎదురవుతాయని గ్రహించాడు.  భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి కూడా ప్రత్యేకరాష్ట్ర డిమాండ్స్ రావచ్చు.   తమ అభివృద్ధి తామే చేసుకుంటామని రాయలసీమవారు తెలంగాణ ఉద్యమం లాంటిది లేపవచ్చు.  ఏనాటికైనా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మూడు ముక్కలు అయ్యే అవకాశం లేకపోలేదు.  ఆ విపత్తును నివారించడానికి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అమోఘమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి.  మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ప్రజల మధ్య సమైక్యత పెరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.  
 
నిజానికి ఈ అంశంలో జగన్ మోహన్ రెడ్డికి స్వార్ధబుద్ధే ఉన్నట్లయితే రాజధానిని తనవారెవ్వరూ లేని విశాఖపట్నంలో పెట్టాలని ఎందుకు అనుకుంటారు?  తన సామాజికవర్గం వారు అధికంగా ఉన్న  కడపలోనో, పులివెందులలోనో పెట్టుకుంటే కాదనేవారెవ్వరు?   న్యాయరాజధానిగా ప్రతిపాదించిన కర్నూల్ కూడా జగన్ సొంత జిల్లా కాదు.   రాష్ట్ర విశాలప్రయోజనాలు ఆశించి ఇంత ప్రశస్తమైన ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి ని అడ్డుకోవడానికి  తెలుగుదేశం పార్టీ, దాని నాయకుడు చంద్రబాబు, ఆయన పాదాలు నాకే కొన్ని ఇతర నికృష్ట పార్టీలు కట్టగట్టుకుని జగన్ కు వ్యతిరేకంగా విధ్వంసాన్ని సృష్టించడానికి తెగించాయి.  అడుగడుగునా ఆటంకాలు సృష్టిసూ ప్రజలతో ఛీ కొట్టించుకుంటున్నాయి.  దీనికి మూల్యం రాబోయే రోజుల్లో భారీగా ఉంటుంది.  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు