మహేష్ బాబుని చూడగానే ఆ ప్రశ్న వేసాను.. మేజర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పటికే ఈయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈయన నిర్మాణంలో వస్తున్న చిత్రం మేజర్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడవి శేష్ నటిస్తున్నార హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇకపోతే ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ట్రైలర్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి బుల్లితెరపై ప్రసారమౌతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలీ హీరోయిన్ ను పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో మహేష్ బాబును కలిశారా? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సాయి మంజ్రేకర్ సమాధానం చెబుతూ మహేష్ బాబుని కలవడం అదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు.అయితే మహేష్ బాబును కలిసిన వెంటనే తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడిగారా? అంటూ అలీ మరోసారి తనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాయి మంజ్రేకర్ సమాధానం చెబుతూ తనని తన సినిమాలో ఛాన్స్ ఇవ్వమని అడగలేదు కానీ తన అందం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని వెంటనే మహేష్ బాబును అడిగినట్లు ఈమె సమాధానం చెప్పారు. ప్రస్తుతం మహేష్ బాబు గురించి సాయి మంజ్రేకర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.