దిశా పటానీ రేంజ్‌లో రెచ్చిపోతున్న విష్ణు ప్రియ

ఆమెలో ఏదో తెలియని స్పార్క్ వుంది. మన టాలీవుడ్ సరిగ్గా వాడటంలేదుగానీ, వాడితే.. విష్ణు ప్రియ, సిల్వర్ స్క్రీన్ మీద సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకునే అవకాశం వుంది. బుల్లితెర యాంకర్.. అనే చాలామందికి విష్ణు ప్రియ గురించి తెలుసు.

ఆమె బాగా డాన్స్ చేస్తుంది.. అంతేనా, ఆమె చాలా చాలా స్టైలిష్‌గా వుంటుంది. ఈ విషయం అడపా దడపా ప్రూవ్ అయినా, ఇప్పుడు మరింతగా ఎలివేట్ అవుతోంది. తాజాగా ఓ ప్రకటన కోసం మోస్ట్ స్టైలిష్‌ గెటప్‌లో కనిపించి అందర్నీ విస్మయానికి గురిచేసింది.

తాజాగా విష్ణు ప్రియ నటించిన ఓ యాడ్, దాంతోపాటుగా చేసిన మరో డాన్స్ వీడియో.. రెండూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిశా పటానీ ఎలాగైతే హాట్ అండ్ స్పైసీ ఇన్నర్ వేర్ ప్రమోషన్లలో రెచ్చిపోతుందో.. ఆ స్థాయిలో వుంది విష్ణు ప్రియ గ్లామర్. సరైన ఛాన్స్ తగిలితే.. విష్ణు ప్రియ రేంజ్ మారిపోతుందంతే.