Disha Patani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దిశా ఇంటిపై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలీవుడ్ లో కూడా ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు వారిద్దరూ ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. యూపీ పోలీసుల సమాచారం ప్రకారం, బరేలీలోని దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్ చేసింది.
ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరి పేరు రవీంద్ర అలియాస్ కల్లు అని, మరో నిందితుడి పేరు అరుణ్ అని వెల్లడైంది. ఘజియాబాద్ లో పోలీసుల ఎస్‌టిఎఫ్ బృందం, ఈ నిందితుల మధ్య ఎన్‌కౌంటర్ జరగ్గా ఇద్దరూ హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్ లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్, దిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది.
एक्ट्रेस दिशा पाटनी के बरेली स्थित घर पर फायरिंग करने वाले दो आरोपियों को नोएडा STF ने मुठभेड़ में किया ढेर@uppstf @CP_Noida #DishaPatani #Bareilly #NoidaSTF #Encounter #CrimeNews #BollywoodNews pic.twitter.com/BWLrn0Mimq
— Kunwar Rakesh Sisodia (@im_rksisodia) September 17, 2025
వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి తాజాగా చెందారు. వారిని రవీంద్ర, అరుణ్ లుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్దమొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారట. ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
