Vishnu Priya: బుల్లితెర ప్రేక్షకులకు నటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో చాలా సీరియల్స్ నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది నటి విష్ణు ప్రియ. అయితే మొదట సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ ఆ తర్వాత సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నాళ్లుగా సీరియల్స్, టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి విష్ణుప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్ ఆరంభంలోనే అమ్మకు క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకు తన క్యాన్సర్ స్టేజెస్ అర్థమయి నా పెళ్లి చూసి చనిపోవాలి అనుకుంది. అయితే నేను అప్పుడే సిద్దుతో ఒక సినిమా చేస్తున్నాను.
ఆ సినిమా సమయంలో ప్రమోషన్స్ లో బాగా కలిసి తిరగడంతో దగ్గరయ్యాము. అప్పుడప్పుడు ఇంటికి పికప్, డ్రాప్ కి వచ్చేవాడు. అప్పటికి మా మధ్య లవ్ ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒక రోజు సిద్ధూతో మా అమ్మకు క్యాన్సర్ అనే విషయం చెప్పి నాకు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పాను. సిద్దు మా ఇంటికి వచ్చి ఇప్పుడు నేను అంతగా సంపాదించట్లేదు కానీ భవిష్యత్తులో మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, పెళ్లి చేయండి అని అడిగాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. నాకు అసలు అతనికి ఈ ఉద్దేశం ఉందని కూడా తెలీదు. మా అమ్మ ఏమో నేను నిజంగానే లవ్ చేశాను అని అనుకుంది.
మా నాన్నకు సిద్ధూ నిజాయితీ నచ్చి ఒప్పుకున్నారు. కానీ మా పెళ్లి జరగకముందే మా అమ్మ చనిపోయింది. చివరి రోజుల్లో మా అమ్మ ఐసియులో ఉన్నప్పుడు కూడా నేను షూటింగ్స్ తో బిజీగా ఉండేదాన్ని. షూటింగ్ అయ్యాక ఎప్పుడో రాత్రికి వెళ్తే రాత్రి సమయాల్లో ఐసియులోకి పంపించేవాళ్ళు కాదు. చివరి రోజుల్లో అమ్మతో ఎక్కువ సేపు ఉండలేకపోయాను. అలా ఐసియులో ఉంటూనే చనిపోయారు అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది విష్ణు ప్రియ. మా అమ్మ చనిపోయిందని ఆమె కోరిక తీరాలని మా అమ్మ చనిపోయిన సంవత్సరంలోనే మా పెళ్లి జరిగింది. నా పెళ్లి సమయానికి నాకు 21 ఏళ్ళు. నా పెళ్ళికి నేను కొనుక్కునేవి అన్ని మా అమ్మ ఫోటో ముందు పెట్టి ఇవి కొన్నాను అని చూపించేదాన్ని. నాన్న కూడా రెండేళ్ల క్రితం చనిపోయారు అని చెప్తూ ఎమోషనల్ అయింది నటి విష్ణు ప్రియ. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Vishnu Priya: మా అమ్మకు కాన్సర్.. ఇంటికొచ్చి పెళ్లి చేసుకుంటా అన్నాడు.. చివరికి అలా!
