Bheemla Nayak : వైరల్ – “భీమ్లా నాయక్” లో ఆ సాంగ్ కి కుర్చీలు జాగ్రత్త అట..!

Bheemla Nayak :గత ఏడాది మాస్ ఆడియెన్స్ సహా బాలయ్య అభిమానులు భారీ సినిమా “అఖండ” కోసం ఎంతలా ఎదురు చూసారో తెలిసిందే. కానీ ఇప్పుడు దానికి మించి మాస్ ఆడియెన్స్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”.

ఇది అవ్వడానికి రీమేక్ సినిమానే కానీ ఇప్పుడు అయితే మాస్ ఆడియెన్స్ లో ఈ సినిమాపై నెలకొన్న బజ్ కానీ హైప్ కానీ ఇంకో లెవెల్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి ఇంత క్రేజ్ నెలకొనడానికి కారణం ఈ సినిమా మ్యూజిక్ అని కూడా చెప్పాలి.

సంగీత దర్శకుడు థమన్ ఎస్ ఇచ్చిన సంగీతం పాటలు వేరే లెవెల్లో హిట్ అయ్యాయి. అందుకే మరింత క్రేజ్ ఈ చిత్రంపై నెలకొంది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా థమన్ పెట్టిన పోస్ట్ అయితే మరింత క్రేజ్ ని నెలకొల్పుతుంది. తాను రికార్డు చేసిన సాంగ్ వీడియో చిన్న బిట్ తన స్టూడియో నుంచి పెట్టి ఈ సాంగ్ కి మాత్రం థియేటర్స్ లో కుర్చీలు జాగ్రత్త అని ముందే వార్నింగ్ ఇచ్చేసాడు.

అంటే ఈ లెక్కన సినిమాలో ఆ సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవాలి. అలాగే ఈ సాంగ్ సినిమా స్టార్టింగ్ సాంగ్ అన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. మరి చూడాల్సిందే ఈ సాంగ్ ఎలా ఉంటుందో అనేది. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.