సీఎంలిద్ద‌రు నంద‌మూరి అభిమానులే: బాల‌య్య‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడిగా నంద‌మూరి బాల‌కృష్ణ అంటే కొంద‌రికి గిట్ట‌ని మాట వాస్త‌వం. రాజ‌కీయాల ప‌రంగా బాల‌య్య‌ను ప్ర‌త్య‌ర్ధి పార్టీలు విమ‌ర్శిస్తాయి. అందులో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయినా విమ‌ర్శించొచ్చు ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయినా విమ‌ర్శించొచ్చు.ఇది కేవ‌లం రాజ‌కీయం కోణం మాత్రమే. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు, స‌వాళ్లు విసురుకోవ‌డం, హ‌ద్దు మీరి దుర్భాష‌లాడుకోవ‌డం, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వెళ్ల‌డం అన్న‌ది చాలా స‌హ‌జంగా జ‌రిగేది. కానీ బాల‌య్య చంద్ర‌బాబుకు వియ్యంకుడు కాక‌ముందు పెద్ద స్టార్. స్వ‌ర్గీయ ఎన్టీరామారావు త‌న‌యుడు.

ఓ స్టార్ గా బాల‌య్య‌ను అభిమానించే వాళ్లు, ఆరాధించే వాళ్లు కోట్ల‌లో ఉన్నారు. రాజ‌కీయంగా విమ‌ర్శించిన వాళ్లే బాల‌య్య‌ను స్టార్ గా ఇష్ట‌ప‌డే వాళ్లు ఉన్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాల‌య్యుకు వీరాభిమాని అని సోష‌ల్ మీడియాలో చాలాసార్లు వైర‌ల్ అయింది. అప్ప‌ట్లో బాల‌య్య న‌టించిన రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ సినిమాలు చూసి జ‌గ‌న్ పెద్ద ఫ్యాన్ అయ్యార‌ని అంటారు. ఇక తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ కు ఎంత పెద్ద అభిమానో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్ పేరునే కేసీఆర్ త‌న కుమారుడుకి కేటీఆర్ అని పెట్టుకున్నారంటే? ఎన్టీఆర్ అంటే ఎంత అభిమాన‌మో తేట‌తెల్ల‌మ‌వుతోంది.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వూలో బాల‌య్య ఇద్ద‌రు సీఎంలా నంద‌మూరి అభిమానులేన‌ని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు నాన్న‌కు అభిమాని అయితే…జ‌గ‌న్ నాకంటూ చెప్ప‌క‌నే చెప్పారు. అంత‌కు ముందు యాంక‌ర్ జ‌గ‌న్ మీ అభిమాని అని తెలుసా? అని అడిగారు .దానికి బాల‌య్య క‌డ‌ప అభిమాన సంఘం ప్రెసిడెంట్ జ‌గ‌న్ అంటూ చెప్ప‌క‌నే చెప్పారు. కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది నాయ‌కులు నాన్న‌గారి అభిమానులేన‌ని గుర్తు చేసారు. అయితే ఇక్క‌డ రాజకీయాలు వేరు. సినిమాలు వేరు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లు బాల‌య్య‌పై వివాదం రేగిన నేప‌థ్యంలో చేయ‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది.