Bheemla Nayak : ఇన్సైడ్ టాక్స్ : “భీమ్లా నాయక్” ఓటిటి హక్కుల్లో ట్విస్ట్..ఆ రెండిట్లో అట.!

Bheemla Nayak : ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హంక్ రానా దగ్గుబాటి లు హీరోలుగా నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రంపై హైప్ ఇంకో లెవెల్లో కొనసాగుతూ వెళ్తుంది.

అయితే ఈ భారీ సినిమా రిలీజ్ కి గాను జస్ట్ కొద్ది రోజులు గ్యాప్ ఉండగా అభిమానులు ట్రైలర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి హక్కులకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈ సినిమా ఓటిటి హక్కులని గాను ఫ్యాన్సీ ధర ఇచ్చి దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ వారు దక్కించుకున్నారన్న టాక్ ఇప్పటికీ తెలిసిందే.

అయితే ఇపుడు ఇక్కడే చిన్న ట్విస్ట్ తెలుస్తుంది. ఈ సినిమా ఓటిటి హక్కులని హాట్ స్టార్ తో పాటు మరో ప్రముఖ సంస్థ ‘ఆహా’ వాళ్ళు కూడా కొనుగోలు చేశారట. అంటే ఈ సినిమా రెండు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా ఓ సినిమా రెండు ఓటిటి లలో రావడం ఇదేమి కొత్త కాదు ఇంతకు ముందు చాలా సినిమాలనే ఇలా అమ్మారు. అలాగే ఈ సినిమా కాస్త లేట్ గానే స్ట్రీమింగ్ కి వస్తుంది అని మరో కొత్త బజ్..