TTD : భక్తుల్ని నిలువు దోపిడీ చేసేస్తోన్న టీటీడీ.?

TTD : ‘సామాన్య భక్తులకు సంబంధించి ఎలాంటి ధరల పెంపు లేదు.. సీఫారసు లేఖల ద్వారా వచ్చేవారికి మాత్రమే సేవల ధరల పెంపు..’ అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విషయమై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ కూడా ఇచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.

టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశానికి సంబంధించి ఓ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అందులో, సభ్యులు మాట్లాడుతున్న తీరు అత్యంత దారుణంగా వుందంటూ భక్తులు వాపోతున్నారు. 400 టిక్కెట్ ధర ‘వై’ 800? 2500 చేసెయ్.. అంటూ వైవీ సుబ్బారెడ్డి చెప్పడం అందులో కనిపిస్తోంది.

ఇంకో సేవ ధరని ఏకంగా పది వేలకు పెంచేయాలంటూ మరో సభ్యుడు ప్రతిపాదిస్తున్నాడు. సంతలో పశువుల వేలం కూడా ఇలా జగదేమో.. అన్నది సగటు భక్తుడి వాదన.

నిజానికి, టీటీడీ చుట్టూ వివాదాలు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూశాయి. ఈసారి మరింత దారుణం.. అంతే. టీటీడీ తీసుకునే నిర్ణయాల వెనుక ప్రభుత్వ ప్రమేయం నేరుగా వుండకపోయినా, ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఆలోచనలే అక్కడ ప్రతిబింబిస్తాయనే బలమైన అభిప్రాయం ప్రజల్లో వుంది. అందులో నిజం లేకపోలేదు కూడా.

అలిపిరి టోల్‌గేట్ ఛార్జీల పెంపు దగ్గర్నుంచి, లడ్డూ ధరల పెంపు, అద్దె గదుల రేట్ల పెంపు.. చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంది. కోవిడ్ నేపథ్యంలో టీటీడీకి ఆదాయం తగ్గిన మాట వాస్తవం. అలాగని, భక్తిని వ్యాపర వస్తువుగా మార్చేస్తే ఎలా.?