TTD: తిరుపతిలో ఇకపై కొత్త నిబంధనలు.. సరికొత్త నిర్ణయాలు తీసుకున్న పాలకమండలి?

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సమావేశంలో భాగంగా వీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలను వెల్లడించారు. ఇక ఈ బోర్డు సమావేశంలో భాగంగా సరికొత్త వివిధ విధానాలను అమలులో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మరి టీటీడీ బోర్డు సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు అనే విషయానికి వస్తే శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేస్తూ డెసిషన్ తీసుకుంది. విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపు కూడా రద్దు చేసింది. టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ అనుసంధానం చేసింది అలాగే తిరుమలలో నిర్మించిన శారదా పీఠం భవనాలను పూర్తిగా నేలమట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల సమయంలో బహుమానాలను కూడా అందజేయాలని ఈ సందర్భంగా బోర్డు సభ్యుల నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలని అన్యమత ఉద్యోగులను తొలగించి వారిని ఇతర డిపార్ట్మెంట్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రైవేట్ బ్యాంకులలో ఉన్నటువంటి టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో పాటు తిరుపతిలో రాజకీయాలకు తావు లేదని బిఆర్ నాయుడు తెలిపారు. ఎంతోమంది స్వామి వారిపై నమ్మకంతో కొండకు చేరుకుంటారు అయితే చాలామంది తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అది రాజకీయ నాయకులైన సినిమా సెలబ్రిటీలైనా సరే రాజకీయాలకు తావు లేదని తెలిపారు.

ఇలా తిరుమల కొండపై స్వామివారి దర్శనం అలాగే స్వామివారి గురించి మాట్లాడటమే తప్ప రాజకీయాల గురించి మాట్లాడిన అలాంటి వీడియోలను టెలికాస్ట్ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాలకమండలి సభ్యులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

TTD Key Decision | Srivani Trust | టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు | 10TV News