వాళ్లని థియేటర్ల దగ్గరకి అనుమతించకూడదు.. వైరల్ అవుతున్న దిల్ రాజు కామెంట్స్!

సంక్రాంతికి వస్తున్నాం సినిమా డేట్ అనౌన్స్ చేసేందుకు నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో పాటు సోషల్ మీడియా రివ్యూవర్స్ పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు అలాంటి వాళ్ల వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోతుందని అందుకే అన్ని సౌత్ ఇండస్ట్రీలో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారని ముందుగా కోలీవుడ్, మాలీవుడ్లలో మొదలుపెట్టిన ఒక భారీ ప్లాన్ ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవ్వటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో మూవీ థియేటర్ల బయట యూట్యూబ్ ఛానల్ లో నిలబడి బయటికి వచ్చే ప్రేక్షకులను రివ్యూలు అడిగి తెలుసుకోవడం ఆపేయాలని ప్రభుత్వాలు ప్రకటించాయి, దీంతో సినిమాల లాంగ్ టైం కాపాడుకోవడానికి ఇది మంచి నిర్ణయం అని మూవీ లవర్స్ ఫీలయ్యారు. టాలీవుడ్ లో కూడా ఆ పద్ధతిని ఫాలో అవుతామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని త్వరలోనే ఈ విషయాన్ని ఫిలిం చాంబర్ కూడా అధికారికంగా ప్రకటించబోతుంది అని చెప్పారు దిల్ రాజు.

దీంతో తెలుగు మూవీ లవర్స్ అందరికీ చాలా రిలీఫ్ ఇచ్చినట్లు అయింది. ఈరోజుల్లో మార్నింగ్ షో పూర్తి అవగానే సినిమా ఎలా ఉంది అనే టాక్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మూవీ యావరేజ్ గా ఉన్నా ఏమీ బాగోలేదు అంటూ చాలామంది ప్రేక్షకులు రివ్యూ ఇవ్వటంతో సినిమాకు రెండో రోజు నుంచే ప్రేక్షకులు రావడం తగ్గిపోతుంది. రివ్యూలు చూసి థియేటర్లకు వెళదాంలే అనుకునే వారు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఎఫెక్ట్ సినిమాలు మీద పడుతుంది.

తంగలాన్, వెట్టయాన్,ఇండియన్ 2 మూవీలు ఈ విధంగా నష్టపోయినవే. లాభాలు కాకపోయినా కనీసం బడ్జెట్ తిరిగి రాబట్టాలన్న రివ్యూలను ప్రేక్షకులు పట్టించుకోకూడదు కానీ అలా పట్టించుకోని ప్రేక్షకులు చాలా తక్కువ ఉంటారు. అందుకే థియేటర్ల వద్దకే రివ్యూలు ఇచ్చే వారిని అనుమతించకూడదని నిర్మాత దిల్ రాజు అన్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదని ఫిలిం ఛాంబర్ తీసుకోవాలని కూడా దిల్ రాజు చెప్పుకొచ్చారు.