హాలీవుడ్ ఫేమస్ ప్రాజెక్ట్ అయిన ద లయన్ కింగ్ సినిమా ప్రపంచం మొత్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా వస్తున్న ముఫాసా సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగానే మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో న్యూ రోర్ అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ని షేర్ చేశారు. ఆ పోస్టర్లో ఏ పాత్రకి ఎవరు డబ్బింగ్ చెప్పారో పేర్కొన్నారు. ముఫాసా పాత్ర కోసం మహేష్ బాబు, టిమోన్ పాత్ర కోసం ఆలీ, పంబా పాత్ర కోసం బ్రహ్మానందం, టాకా పాత్ర కోసం సత్యదేవ్ వాయిస్ లని అందించారని చెప్పారు.
ఈ విషయంపై సత్యదేవ్ స్పందిస్తూ సినిమాలో మహేష్ బాబు పాత్ర ముఫాసా, సత్యదేవ్ పాత్ర టాకా ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య విభేదాల నేపథ్యంలో సినిమా సాగుతుందని, మహేష్ బాబుకి ఆపోజిట్ గా డబ్బింగ్ చెప్పడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పారు. అంతేకాకుండా సినిమాలో మహేష్ వన్ లైనర్లు అద్భుతంగా ఉంటాయని చెప్పి సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశారు.
ఇక మహేష్ బాబు మాట్లాడుతూ మరొక నెల రోజుల్లో ముఫాసా రాబోతుంది చూసేందుకు రెడీగా ఉండండి అని పేర్కొన్నారు. జెంకిన్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని తెలుగులో మహేష్ బాబు డబ్బింగ్ చెప్తే హిందీలో షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ముఫాసా పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. దానికి తోడు ట్రైలర్ సైతం బాగుండటంతో ఈ సినిమా కోసం పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నారు.