YSRCP: వైసీపీని ఊరిస్తున్న సెంటిమెంట్.. వచ్చే ఎన్నికలలో గెలుపు వారిదేనా?

YSRCP: ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఏపీ రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల సమయానికి వైకాపా పార్టీ అనేది అసలు ఉండదని తన పార్టీని జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అంటూ ఇదివరకు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ పార్టీ కూడా రెండు సార్లు వరుసగా అధికారంలోకి రాలేదని చెప్పాలి.

2014వ సంవత్సరంలో హైదరాబాద్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని అందుకున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలలో కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం వైకాపా 151 స్థానాలలో ప్రభంజనం సృష్టించడం జరిగింది. ఇలా ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి తన పరిపాలన ఏంటి అనే విషయాన్ని ప్రజలు గ్రహించారు.

ఇక జగన్మోహన్ రెడ్డి కులమత బేధాలు లేకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగానే పథకాలను అమలు చేశారు. మరోవైపు మెడికల్ కాలేజీలు ,పోర్టులు, విమానాశ్రయాలు అంటూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించారు. కచ్చితంగా ఈయనే 2024 ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 స్థానాలకు మాత్రమే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు.

ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికల బరిలోకి రావడం జగన్ ఓటమికి కారణమని చెప్పాలి. ఇలా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 40% ఓటు షేరింగ్ సొంతం చేసుకున్నారు. ఇక జగన్ ఇలాంటి పరాజయం ఎదుర్కోవడానికి గల కారణాలను ఇటీవల ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విశ్లేషించారు. ఇప్పటికీ ఏపీ ప్రజల నాడిని సరిగా గుర్తించలేకపోతున్నామని తెలిపారు.

తమ ప్రభుత్వ హయామంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. అలాగే ప్రజలకు కావాల్సిన విద్య వైద్యరంగంలో పెను మార్పులను తీసుకువచ్చినప్పటికీ తమ పార్టీ ఓటమికి కారణం ప్రజల అత్యాశ అని తెలిపారు. ఎవరు ఎక్కువగా పథకాలను అందిస్తాము అంటే ప్రజలు వారి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇకపోతే తమిళనాడు ప్రజల మాదిరిగా ఆంధ్రాలో కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే ఏ పార్టీ కూడా రెండుసార్లు అధికారంలోకి రావడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 2029 లో తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఉన్నాయి.