Home News 'కొవ్వు'ల్లో మంచి-చెడు ఉంటాయా..? శరీరానికి లాభమా.. నష్టమా?

‘కొవ్వు’ల్లో మంచి-చెడు ఉంటాయా..? శరీరానికి లాభమా.. నష్టమా?

శరీరంలో కొవ్వు ఉండకూడదు. కొవ్వు ఉంటే గుండె జబ్బు రావొచ్చు. డయాబెటిస్ రావొచ్చు. కొవ్వు పదార్ధాలు తింటే లావైపోతాం. ఇందులో నిజమే ఉన్నా.. శరీరంలో మంచి కొవ్వు, చెడు కొవ్వు ఉంటాయి. వీటి మధ్య తేడాలు కూడా ఉంటాయి. అవి శరీరంపై చూపే ప్రభావాల్లో కూడా తేడాలుంటాయని చాలామందికి తెలీదు. కొవ్వు పదార్ధాల గురించి ఆందోళన చెందడం అనవసరం అంటున్నారు న్యూట్రీషియన్లు. ఒక పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు. శరీరానికి కొవ్వు అవసరమనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇందుకు నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు.

Your Diet After Gallbladder Removal Rm 722X406 1 | Telugu Rajyam

శరీరానికి కొవ్వు అవసరం. శరీరానికి మేలు చేసే కొవ్వు, కీడు చేసే కొవ్వు ఉంటాయి. అయితే.. ఈ రెండింటి మధ్య తేడాలు గుర్తించాల్సి ఉంది. వాటి నిర్మాణంలో తేడాలు ఉంటాయి. వీటిని తెలుసుకుని ఆహారం తీసుకోవాలి. కండరాలు గట్టి పడటానికి, రోగనిరోధక శక్తిని అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి. ఆహారంలోని కొవ్వు విటమిన్లు, ఖనిజాలను గ్రహిస్తాయి కూడా. మంచి కొవ్వు ఫ్యాటీ యాసిడ్‌ తయారయ్యేందుకు ఉపయోగపడుతుంది. మెదడు సరిగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి పెంచేందుకు కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సిందే.

గింజలు, పప్పులు, తృణ ధాన్యాల్లో మంచి కొవ్వు ఉంటుంది. ఇవి తింటే బలం కూడా. ఇవి జీవక్రియను కూడా పెంచుతాయి. ప్రకృతి నుంచి సహజంగా తయారయ్యే ఆహారంలో కూడా మంచి కొవ్వు ఉంటుంది. వీటిలో పాలీ, మోనో శాచ్యురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇవి శరీరానికి ఉపయోగపడటమే కాదు.. పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి కూడా. కొలెస్టరాల్ ను కూడా తగ్గిస్తాయి. టైప్-2 మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి.

ప్యాకింగ్ చేసిన ఆహారం, రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్స్ లో కొవ్వు ఉంటుంది. ఇవే శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. గుండె జబ్బులకు కూడా కారణం కావొచ్చు. శరీరంపై వాపు, మచ్చలు, దురద సమస్యలను కూడా తెచ్చిపెడతాయి. ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండాలనే న్యూట్రీషియన్లు, డాక్టర్లు కూడా చెప్తూంటారు. విటమిన్ A, D, K, Eలు కొవ్వులో కరుగుతాయి. శరీరం వీటిని గ్రహించాలంటే తగిన మోతాదులో కొవ్వులు ఉండాలి. పాల పదార్థాల ద్వారా పోషకాలు కలిగించే ఇలాంటి కొవ్వు లభిస్తుంది.

గమనిక: ఈ చిట్కాలన్నీ ఆరోగ్య నిపుణులు ఆయా సందర్భాల్లో సూచించినవే ఇవ్వడం జరిగింది. ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. మంచి ఆరోగ్యం, ఆహారం కోసం డాక్టర్లను సంప్రదించడమే ఉత్తతమైన మార్గం. గమనించగలరు.

- Advertisement -

Related Posts

షడ్రుచుల ‘ఉగాది పచ్చడి’ ఆరోగ్యానికి ఎంతో మేలు..!

వేసవి ప్రారంభమయ్యాక వచ్చే ‘ఉగాది’ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. షడ్రుచుల సమ్మేళనంతో చేసుకునే ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని సృశిస్తుందని అంటారు. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు కారం.. ఇలా...

తిరుపతి లోక్ సభ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలట.!

  సినీ నటి హేమ, పార్టీలు మారీ.. మారీ.. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చిన్న హాల్ట్ వేసినట్టున్నారు. కాస్సేపటి క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారామె. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,...

వాలంటీర్లే వైసీపీకి స్ట్రాంగ్ పిల్లర్స్.?

  పార్టీ కార్యకర్తల సంగతెలా వున్నా, వాలంటీర్లను ఉద్దేశించి పదే పదే ప్రశంసిస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా, ఉగాది నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను...

Latest News