Bheemla Nayak : ఫైనల్ గా “భీమ్లా నాయక్” పై బ్లాస్టింగ్ అప్డేట్..ట్రైలర్ కి టైం లాక్.!

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానులు సహా రానా దగ్గుబాటి అభిమానులు చాలా ఆసక్తికరంగా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ “భీమ్లా నాయక్” ట్రైలర్ కోసం. సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ తో పాటుగా అన్ని అప్డేట్స్ కి రంగం సిద్ధం చేస్తున్నారు.

మరి ఫైనల్ గా మిగిలిన పెద్ద అప్డేట్ నే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యడం. ఈ సినిమాలోని అవైటెడ్ ట్రైలర్ ని ఈరోజు ఫిబ్రవరి 21 న రిలీస్ చేస్తున్నట్టు అనౌన్స్ చెయ్యగా ఇక అదెప్పుడు రిలీజ్ అవుతుంది టైం ఎప్పుడా అని చూస్తుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. మరి ఈరోజు జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే సమయం లోనే రాత్రి 8 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసి సాలీడ్ అప్డేట్ అందించారు.

ఈ క్రేజీ మాసివ్ ట్రైలర్ కోసం అంతా మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇంకా దీనిపై రిలీస్ చేసిన పోస్టర్ లో పవన్ మరియు రానా లుక్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. మరి దర్శకుడు సాగర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మాసివ్ ట్రైలర్ ఏ రేంజ్ రికార్డ్స్ అందుకుంటుందో చూడాల్సిందే.