Sesame oil: ఈ నూనెలో ఇన్ని ఔషధగుణాల? తెలిస్తే తప్పకుండా ఉపయోగిస్తారు..!

Sesame oil: నువ్వుల నూనె ను హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నూనెను ఎక్కువ గా దేవుని దగ్గర దీపారాధన చేయడానికి వినియోగిస్తుంటారు. అయితే ఇది దీపారాధనకే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నువ్వుల నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యంలో కూడా నువ్వుల నూనెను ఎక్కువ వినియోగిస్తారు. నువ్వులలో బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్సియం ఉంటుంది. నలుపు మరియు ఎరుపు నువ్వులలో ఐరన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల తెల్ల నువ్వులలో 1000 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.

రక్త హీనత తో బాధపడేవారికి నువ్వులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నువ్వుల నూనెలో ఉండే లేసిథిన్ అనే రసాయనం రక్త నాళాలలో ఉండే కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె లో విటమిన్ బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నువ్వుల నూనె మితోనిన్ మరియు టిఫ్రోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. నువ్వుల నూనెలో సిస్మొల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వంట నూనెలో వాడటం వల్ల ఆయుర్వేదం గా పనిచేస్తుంది. నువ్వుల నూనెలో ఉండే భాస్వరం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

జీవక్రియను పెంపొందించే ఆరోగ్యమైన కొవ్వులు నువ్వుల్లో ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని కూడా తగ్గిస్తాయి. శరీరానికి గాఢ నిద్రను కలిగించే టిఫ్రోఫోన్ నువ్వుల నూనెలో ఉంటుంది. నువ్వు లలో ఉండే మేతోనిన్ కాలేయానికి మేలు చేస్తుంది. నువ్వులు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నువ్వుల నూనె లో క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి గుండె కండరాలు సజావుగా పనిచేసి, గుండె సక్రమంగా కొట్టుకోవడానికి దోహదపడతాయి.

ఇందులో మోనో అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందిస్తుంది. పక్షవాత సమస్యలను నివారించగల సామర్థ్యం నువ్వుల నూనెలో ఉంటుంది. ఈ నూనెను జుట్టుకు పూయడం వలన జుట్టు పొడవుగా పెరుగుతుంది. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడేవారు నువ్వుల నూనెలో కొద్దిగా సొంటి పొడి, చిటికెడు ఇంగువ పొడి వేసి ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట అప్లై చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.