పూరి జగన్నాథ్,విజయ్ సినిమాకు భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏం జరిగిందంటే?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకొని ఏడాది ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇకపోతే ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి పూరి జగన్నాథ్ జనగణమన సినిమా మహేష్ బాబు హీరోగా చేయాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు చేయలేకపోవడంతో ఆ అవకాశాన్ని విజయ్ దేవరకొండ అందుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ సినిమా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతుందని తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాని కూడా పూరీజగన్నాథ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. ఇక ఈ సినిమాని కూడా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇన్వెస్టర్లతో కలిసి నిర్మిస్తున్నారు. వీరి సూచనల ప్రకారం పూరి జగన్నాథ్ జనగణమన టీమ్ తో పాటు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఈ సినిమాకి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ సినిమా కథ విన్న కేంద్ర ప్రభుత్వం ముంబై మహానగరాన్ని మిలిటరీ ఫోర్సులు చుట్టుముట్టే కథ కావడంతో భారతదేశ ప్రభుత్వం, డిఫెన్స్ ఈ రెండూ కూడా ఈ సినిమాకు అప్రూవల్ ఇవ్వలేదు. దీంతో పూరి జగన్నాథ్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథలో ఏవిధమైనటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా పూరి జగన్నాథ్ సినిమా కథను తయారు చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ పూర్తి కావడానికి మరింత ఆలస్యం కావడంతో విజయ్ దేవరకొండ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.