విజయ్‌ తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్‌ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఇదిలావుంటే రంజాన్‌ కానుకగా విజయ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ అందించారు మేకర్స్‌. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 05న వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు విజయ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ రష్యాలో జరుపుకుంటుంది. రష్యాలో విజయపై యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.