ఇండియన్ సినిమా దగ్గర మరీ ముఖ్యంగా సౌత్ ఇండియా సినిమా దగ్గర సినీ పరిశ్రమ నుంచి పలువురు స్టార్స్ రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమి కాదు. కాగా రీసెంట్ గానే తమిళ బిగ్గెస్ట్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా రాజకీయాల్లోకి కొత్త పార్టీ పెట్టి అరంగేట్రం చేసాడు.
అయితే విజయ్ ఎంట్రీ ఇస్తూనే తాను జస్ట్ మరొక్క సినిమా మాత్రమే చేసి రాజకీయాల్లోనే ఉంటాను అని షాకిచ్చాడు. దీనితో ఆ సినిమా ఏంటి అనేది ఆసక్తి నెలకొంది. కానీ విజయ్ ని నమ్ముకొని ఒక సినిమాటిక్ యూనివర్స్ లో “లియో” అనే సినిమా తీసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ని అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం విజయ్ హ్యాండ్ ఇచ్చినట్టే అని అనుకోవాలి.
నిజానికి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లియో నే అతి పెద్ద సినిమా ఇంకా అన్ని పాత్రల్లో కూడా లియో దే మోస్ట్ పవర్ ఫుల్ పాత్ర అని కూడా టాక్ ఉంది. ఇక మొన్న వచ్చిన లియో తర్వాత ఈ సినిమాల పరంపర మరిన్ని చిత్రాల్లో విజయ్ ఉంటాడని అలాగే లియో కి పార్ట్ 2 కూడా ఉందని కన్ఫర్మ్ అయ్యింది.
ఇంకా చాలా కీలక ప్రశ్నలకి కూడా లియో 2 లోనే సమాధానాలు దొరకాల్సి ఉంది. దీనితో విజయ్ ఇప్పుడు అర్ధాంతరంగా సినిమాలు ఆపేస్తే ఇక లోకేష్ కనగరాజ్ సినిమాల్లో లేనట్టే అనుకోవాలా? కాగా 69వ సినిమా అయితే ఖచ్చితంగా లోకేష్ తో చేసే ఛాన్స్ లేదు దీనితో లోకేష్ కనగరాజ్ మళ్ళీ విజయ్ ని ఒప్పిస్తాడా లేదా సినిమాల విషయంలో విజయ్ పునరాలోచన చేస్తాడేమో చూడాలి.