TDP Threat : పెను ముప్పు టీడీపీ నుంచే: జనసేనానికి అర్థమవుతోందా.?

TDP Threat

TDP Threat : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బకొట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానే కాదు.. టీడీపీ నుంచే జనసేన పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. 2009 ఎన్నికల సమయంలో అప్పటి ప్రజారాజ్యం పార్టీ మీద విషం చిమ్మింది తెలుగుదేశం పార్టీనే. ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి తెలుగుదేశం పార్టీనే కారణం.

భవిష్యత్తులో జనసేన పార్టీ అనేది రాజకీయ తెరపై నుంచి మాయమైతే, దానికి కూడా తెలుగుదేశం పార్టీనే కారణమవుతుంది. గడచిన ఎనిమిదేళ్ళ జనసేన ప్రస్థానాన్ని తీసుకుంటే, ఆ పార్టీ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నది తెలుగు తమ్ముళ్ళే. ఓ రాజకీయ పార్టీగా జనసేనను ధైర్యంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటుంది. టీడీపీతో అయినా వైసీపీ పోరాటం అలాగే వుంటుంది.

వైసీపీ రాజకీయం వేరు, వైసీపీ ఆలోచనా విధానం వేరు. వైసీసీ గనుక, టీడీపీలా ఆలోచిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఈపాటికే నామరూపాల్లేకుండాపోయేది. టీడీపీ ఎమ్మెల్యేలని వైసీపీలోకి లాగేసుకుని, వారిలో కొందరికి మంత్రి పదవుల్ని కట్టబెట్టి వుంటే, ఇప్పుడసలు టీడీపీ వుండేదా.?

ఇక, జనసేన విషయానికొస్తే.. నిజమే, జనసేన ఎమ్మెల్యేని వైసీపీ లాగేసుకుంది. కానీ, వైసీపీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎందుకు ఇమడలేకపోతున్నారు.? వైసీపీలో ఇమడలేకపోయినా తిరిగి జనసేన వైపో, లేదంటే టీడీపీ లేదా బీజేపీలోకో ఎందుకు వెళ్ళడంలేదు.?

జనసేనాని వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు తీవ్రంగానే ఖండిస్తుంటారు. అయితే, అంతకన్నా పరుషమైన పదజాలంతో జనసేన పార్టీని నైతికంగా దెబ్బతీయడం టీడీపీకి తెలుసు. పవన్ కళ్యాణ్ మీద అమరావతిలో రాళ్ళేయించిన ఘన చరిత్ర టీడీపీది. అవన్నీ మర్చిపోయి, జనసేనాని.. టీడీపీతో కలుస్తామని సంకేతాలు పంపితే.. నష్టపోయేది జనసేన మాత్రమే.!