Revolt of Bheem: కొమరం భీముడొచ్చాడు.. ఎన్టీఆర్ ఫాన్స్ కు ఇక పూనకాలే

Revolt of Bheem: ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ రిలీజ్ అయ్యింది. ‘Revolt of Bheem’ పేరుతో భీం (ఎన్టీఆర్) తిరుగుబాటుకు సంబంధించిన వీడియో సాయంత్రం 7 గంటలకు చిత్రబృందం విడుదల చేసింది.

కొమరం భీముడో అంటూ అని సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంది. ఈ పాటను చూస్తే గూస్బామ్స్ రావడం మాత్రం ఖాయం. ఈ పాటతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ ఎక్సప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా కీరవాణి సంగీతం, కాల భైరవుడు గానం ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటతో ఆర్ఆర్ఆర్ సినిమా అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. ఇంక ఎన్టీఆర్ ఫాన్స్ కి అయితే పూనకాలు తెప్పించేలా ఈ సాంగ్ ఉంది.

ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మల్టీ స్టారర్ గా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రని రాంచరణ్ పోషిస్తుండగా, కొమరంభీం పాత్రని జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని దర్శకధీరుడు ‘జక్కన్న’ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ నటి నటులు అలియాభట్, అజయ్ దేవగన్ లు కీలకపాత్రలను పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.

YouTube video player