లోకేష్‌ని పక్కన పెడితేనే మంచిది.! కానీ, కుదురుతుందా.?

ఏం చేసినా పుత్ర రత్నం నారా లోకేష్ కోసమే.! ఎమ్మెల్యేగా గెలవలేడు గనుక, ముందే ఊహించి, ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇచ్చుకున్నారు కొడుకు నారా లోకేష్‌కి తండ్రి నారా చంద్రబాబునాయుడు గతంలో.! అదీ పుత్రుడిపై తండ్రికున్న ప్రేమ.!

కానీ, 2019 ఎన్నికల్లో ఏమయ్యింది.? నారా లోకేష్ పోటీ చేశారు, ఓడిపోయారు కూడా.! కొద్ది మార్జిన్‌తోనే నారా లోకేష్ ఓడిపోయినా, ఓటమి అనేది చాలా ఖరీదైంది అయిపోయింది.! అధినేత తనయుడి ఓటమి, పార్టీ శ్రేణుల్లో పూర్తిస్తాయి నిస్తేజాన్ని నింపేసింది.

ఆ సంగతి పక్కన పెడితే, రాజకీయంగా నారా లోకేష్ మాట్లాడే ప్రతి మాటా, వేసే ప్రతి అడుగూ, తెలుగుదేశం పార్టీకి చాలా చాలా నష్టాన్ని కలగజేస్తోంది.! ఆర్థికంగా కూడా అదే పరిస్థితి.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు విషయమై ఎప్పటికప్పుడు గందరగోళం కనిపిస్తోందంటే, దానిక్కారణం నారా లోకేష్ అండ్ టీమ్. ప్రతిసారీ జనసేన నుంచి ఒకటే కంప్లయింట్ టీడీపీ అధినేత చంద్రబాబుకి. ‘మీ కుమారుడి బృందాన్ని కాస్త అదుపులో పెట్టుకోండి’ అని.

బాహాటంగా జనసేన ఈ విషయాన్ని చెప్పకపోయినా, జనసేన శ్రేణులైతే అదే చెబుతున్నాయి. లోకేష్ కనుసన్నల్లో ఓ వర్గం మీడియా పనిచేస్తోంది. అదే టీడీపీని నాశనం చేస్తోంది కూడా. చంద్రబాబుకి ఇవేవీ తెలియవని అనుకోలేం. కానీ, ఆయనా ఏమీ చేయలేని పరిస్థితి.

ఒకవేళ జూనియర్ ఎన్టీయార్‌ని దువ్వితేనో.! చంద్రబాబుకి ఈ ఆలోచన వస్తుందేమోనన్న కోణంలో, టీడీపీ దరిదాపుల్లోకి కూడా జూనియర్ ఎన్టీయార్ రాకుండా చేస్తున్నారు నారా లోకేష్. అదీ సంగతి.