బాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీయార్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు జూనియర్ ఎన్టీయార్.. ఇద్దరూ బాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించేసుకున్నారు. ఈ ఇద్దరూ ఏ సినిమా చేసినా, అది పాన్ ఇండియా రేంజ్ సినిమానే అవుతోంది. కాదు కాదు, అవి పాన్ వరల్డ్ సినిమా అయ్యేలా వున్నాయ్.

జూనియర్ ఎన్టీయార్ ప్రస్తుతం హృతిక్ రోషన్ నటిస్తోన్న ‘వార్-2’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీన్ని మల్టీస్టారర్‌గా పేర్కొనవచ్చు. ఈ సినిమా తర్వాత మరో స్ట్రెయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీయార్ చేయబోతున్నాడట.

‘వార్-2’ సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థే, జూనియర్ ఎన్టీయార్ తదుపరి స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా చేయబోతోందని తెలుస్తోంది. అయితే, అది స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమానా.? లేదంటే, తెలుగు సినిమానే.. పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తారా.? అన్నదానిపై కొంత సస్పెన్స్ వుంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ ‘దేవర’ సినిమా పనుల్లో వున్నారు. తొలి పార్ట్ వచ్చే నెలలో విడుదల కావాల్సి వున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది ‘దేవర’ వస్తుందో లేదో అన్న విషయమై కొంత గందరగోళం వుంది.

పార్ట్ వన్ పూర్తి చేసి, ‘దేవర’ పార్ట్ టూని కూడా జూనియర్ ఎన్టీయార్ పూర్తి చేయాల్సి వుంది. అయితే, ‘దేవర’ పార్ట్ వన్ – దేవర పార్ట్ టూ మధ్య కొంత గ్యాప్ వుండొచ్చు. ఈ గ్యాప్‌లో జూనియర్ ఎన్టీయార్ స్ట్రెయిట్ సోలో బాలీవుడ్ ప్రాజెక్టు వుంటుందని అనుకోవచ్చేమో.!