‘వార్‌-2’ కోసం ముంబై చేరిన ఎన్టీఆర్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ , బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ ‘వార్‌ -2’. తారక్‌ ఈ సినిమాతో హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. స్పై జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్‌ ముఖర్జీ డైరెక్ట్‌ చేస్తున్నాడు. ‘వార్‌ -2’ షూట్‌ కోసం తారక్‌ ముంబైలో ల్యాండ్‌ కాగా.. తారక్‌ తన హెయిర్‌స్టైల్‌ను కవర్‌ చేస్తూ టోపీని పెట్టుకున్న విజువల్స్‌ ఇప్పటికే నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చే మాస్‌ సాంగ్‌ను షూట్‌ చేయబోతున్నారట. అయాన్‌ ముఖర్జీ డిజైన్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ త్వరలోనే షూట్‌ చేయనున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. హృతిక్‌, తారక్‌ సూపర్‌ స్టైలిష్‌ మాస్‌ డ్యాన్సర్లు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ ఇద్దరి కాంబోలో వరల్డ్‌ క్లాస్‌ మెస్మరైజింగ్‌ సాంగ్‌ను ప్లాన్ చేశాడట. వార్‌ ఫస్ట్‌ పార్టులో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబోలో ఇలాంటి సాంగ్‌ పెట్టారని తెలిసిందే. ఈ సారి వార్‌ 2లో రాబోయే పాట నెక్ట్స్‌ లెవల్‌లో ఉండబోతుందని బీటౌన్‌ సర్కిల్‌ టాక్‌. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ సినిమాను భారీ బ్జడెట్‌తో తెరకెక్కిస్తోంది. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో 10 రోజుల పాటు షూటింగ్‌ కొనసాగనుందట.

ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఎన్టీఆర్‌ ఇంటర్నేషనల్‌ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌తో రెండు వారాలపాటు ట్రైనింగ్‌ సెషన్‌లో పాల్గొన్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. ‘వార్‌-2’లో తారక్‌ నెగెటివ్‌ షేడ్స్‌తో సాగే స్పై రోల్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్‌ చేసిన ‘వార్‌ -2’ గ్లింప్స్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో ప్రాజెక్టు ‘వార్‌ -2’ కావడం విశేషం.