Home Andhra Pradesh రాందేవ్ బాబాని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి

రాందేవ్ బాబాని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి

ఆరేడు నెల‌లుగా క‌రోనా వైర‌స్ తో ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. భార‌త్ లోనూ వైర‌స్ ఉదృతి అంత‌కంత‌కు పెరుగుతోంది. ల‌క్ష‌ల్లో కేసులు..మ‌ర‌ణాలు..ఈ వినాశ‌నం ఎంతుకు దారి తీస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌దేశాల‌న్ని ఆర్ధిక న‌ష్టాల్లో ప‌డిపోయాయి. న‌ష్టాల నుంచి తెరుకునే ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. అటు వైర‌స్ దాడి అంత‌కంత‌కు పెరుగుతుందే త‌ప్ప త‌గ్గిన దాఖ‌లాలు లేవు. మ‌రోవైపు వ్యాక్సిన్ కోసం వైర‌స్ జాడ క‌నిపెట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌పంచ దేశాలు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి పురోగ‌తి సాధించ‌లేదు. కరోనాకి సాధార‌ణ జ్వ‌రానికి ఇచ్చే మాత్ర‌లు త‌ప్ప కొత్త‌గా మెడిసిన్ అంటూ ఏదీ లేదు.

ఇటీవ‌లే భార‌త్ కు చెందిన రెండు అగ్ర కంపెనీలు కరోనాకి కి ఓ మాత్ర‌, ఇంజెక్ష‌న్ మార్కెట్ లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కానీ అవి తాత్క‌లికం మాత్ర‌మే. మాన‌వ శ‌రీరంలో వాటి ప‌నితీరు ఎలా ఉంటుంద‌న్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. ఇదే అదునుగా భావించిన యెగా గురువు రాందేవ్ బాబు త‌న ప‌తంజ‌లి సంస్థ ద్వారా క‌రోనాకి వైర‌స్ ప‌రిష్కారం మందు క‌నుగున్నాన‌ని, ఆ మందు వేసుకుంటే క‌రోనా రాదు అంటూ విష ప్ర‌చారానికి దిగారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టుల‌కు గానీ, డాక్ట‌ర్లు గానీ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు గాని క‌నిపెట్ట‌లేని మందును తాను క‌నిపెట్టాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

దీంతో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ , రాందేవ్ బాబాపై మండిప‌డ్డారు. ఇలా చీటింగ్ చేసిన వాళ్ల‌ను త‌క్ష‌ణం అరెస్ట్ చేయ‌క‌పోతే చాలా ప్ర‌మాదాలు జ‌గుతాయ‌ని హెచ్చ‌రించారు. రాందేవ్ బాబాని ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసారు. ఇలాంటి మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌త‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అలాగే సోష‌ల్ మీడియాలో యుగాంతం అంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని నారాయ‌ణ కొట్టిపారేసారు. ఇలాంటి ప్ర‌చారాల‌కు ఎలా తెర దీస్తారని మండిప‌డ్డారు.

- Advertisement -

Related Posts

అభిమానుల్ని అవమానించిన పవన్ కళ్యాణ్.. నిజమేనా.?

నిఖార్సయిన పవన్ కళ్యాణ్ అభిమానులెవరైనా, జనసేన పార్టీకే ఓటు వేసి వుంటారు 2019 ఎన్నికల్లో. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగి వుంటుంది. సినీ అభిమానం అంటే అలాగే...

కాజల్ అగర్వాల్ పెళ్లి తరవాత నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే.. భర్త కి స్క్రిప్ట్ వినిపించింది.

కాజల్ అగర్వాల్ పెళ్ళి తర్వాత సినిమాలు మానేస్తుందని ప్రచారం చేసిన వాళ్ళకి గట్టి షాకిచ్చింది. పెళ్ళి తర్వాత మొట్ట మొదటి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీలో అందరికీ...

పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌.. న‌లుగురు కెప్టెన్స్‌తో మెగాస్టార్ పిక్ వైర‌ల్‌

ఆరు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌ధ్య‌లో రాజ‌కీయాల వైపు వెళ్లిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చి అల‌రిస్తున్నారు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఖైదీ...

సూర్య – బోయపాటితో సినిమా ? వద్దు బాబోయ్ అంటున్న అతని ఫ్యాన్స్ ?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ఆధారంగా లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ...

Latest News